Homeటాప్ స్టోరీస్డల్ గా ఓవర్సీస్ మార్కెట్లు.. దిగులుగా నిర్మాతలు

డల్ గా ఓవర్సీస్ మార్కెట్లు.. దిగులుగా నిర్మాతలు

డల్ గా ఓవర్సీస్ మార్కెట్లు.. దిగులుగా నిర్మాతలు
డల్ గా ఓవర్సీస్ మార్కెట్లు.. దిగులుగా నిర్మాతలు

ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే టాలీవుడ్ కు బంగారు బాతు గుడ్డు వంటిది. 1 మిలియన్ సాధించడమే గొప్ప అని ఫీల్ అయిన పరిస్థితి నుండి 3 మిలియన్ దాటే వరకూ తెలుగు సినిమా యూఎస్ లో వ్యాపించింది. ఓవర్సీస్ అనగానే టాలీవుడ్ కు మేజర్ బిజినెస్ యూఎస్ నుండే వస్తుంది. ఒకానొక దశలో తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ బిజినెస్ జరిగే ఏరియా నైజాంతో సమానంగా ఓవర్సీస్ లో బిజినెస్ అయ్యేవి మన సినిమాలు. ఓవర్సీస్ మార్కెట్ పెరగడంతోనే మన వాళ్ళు ధైర్యంగా సినిమా బడ్జెట్ లను ఇంకొంచెం పెంచుకోగలిగారు. అయితే బంగారు బాతు గుడ్డు కథలోలానే ఓవర్సీస్ లో పరిస్థితి తయారైంది. ఆ కథలో ఒకేసారి బంగారు గుడ్లు పెట్టట్లేదని అత్యాశకు పోయి దాన్ని చంపుకున్నట్లు ఓవర్సీస్ మార్కెట్ ను కూడా మన వాళ్ళు చంపేసుకుంటున్నారు. గత కొంత కాలంగా చూసుకుంటే ఓవర్సీస్ లో హిట్ అయిన తెలుగు సినిమా కనిపించదు. దీనికి పలు కారణాలున్నాయి.

అందులో మొదటిది, నిర్మాతల అత్యాశ. ఓవర్సీస్ మార్కెట్ బాగుంది కదా అని భారీ రేట్లకు అమ్మడం, దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు రికవర్ చేసుకోవడానికి భారీ రేట్లకు అమ్మడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒక సినిమా చూడటానికి దాదాపు 30 డాలర్లు దాకా టికెట్ రేట్లు పెట్టేవారంటే అత్యాశ కాకుండా దురాశ అనాలేమో. సరిగ్గా ఇదే సమయంలో డిజిటల్ స్ట్రీమింగ్ విస్తృతమైంది. ఇప్పుడు ఏ చిత్రమైన అధికారికంగా ఆన్లైన్ లో 30 రోజుల్లో వచ్చేస్తుంటే అంత భారీ రేట్లు పెట్టి ఎవడైనా సినిమాను ఎందుకు కొంటాడు, ఎందుకు కొనాలి. మరోవైపు ఇక్కడి బయ్యర్లు అందరూ కలిసి ఒక సిండికేట్ గా తయారై కొత్తవాళ్లను రానివ్వకపోవడం మరో ప్రధాన కారణం.

- Advertisement -

తెలుగు సినిమాలు లాస్ట్ గా సక్సెస్ చూసింది రంగస్థలం, భరత్ అనే నేను వంటి సినిమాలతోనే.. ఆ తర్వాత నుండి వచ్చిన పెద్ద సినిమాలు, ప్యాన్ ఇండియా చిత్రాలు అన్నీ బొక్కబోర్లా పడ్డాయి. అక్కడి బయ్యర్లకు సినిమా వ్యాపారమంటే భయం పుట్టేలా చేసాయి. సంక్రాంతికి విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలకు తప్పితే రీసెంట్ గా విడుదల కావాల్సిన ఏ సినిమాకు కూడా అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగట్లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఓవర్సీస్ లో మార్కెట్ పూర్తిగా డెడ్ అయిపోవడం ఖాయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All