
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి వస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. పుష్ప కథ ప్రకారం ఎక్కువగా అవుట్ డోర్ లోనే షూట్ చేయాలి. ఎక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ తో సినిమా తీయడం కాబట్టి కచ్చితంగా బడ్జెట్ ఎక్కువవుతుంది. అలాగే సుకుమార్ అంటే పెర్ఫెక్షన్ కు పెట్టింది పేరు. కాబట్టి సీన్స్ రీషూట్ చేయడం కూడా బాగానే జరిగినట్లు తెల్సింది.
ముందుగా ఈ సినిమా బడ్జెట్ కు కేటాయించుకుంది దాదాపు 170 కోట్ల రూపాయలు. అయితే వినిపిస్తోన్న సమాచారం ప్రకారం పుష్ప బడ్జెట్ బాగానే అదుపు తప్పినట్లు సమాచారం. అందుకే అనుకున్న దానికంటే ఎక్కువగా 45 కోట్ల రూపాయలు మొదటి పార్ట్ కే ఎక్కువ అయిందని తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొంత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. పైగా పుష్ప హిందీ వెర్షన్ విషయంలో కూడా కొంత వివాదం నడుస్తోంది.
డబ్బింగ్ రైట్స్ ముందే అమ్మేయడం, ఆ సదరు సంస్థ థియేట్రికల్ రెవిన్యూలో వాటా అడుగుతుండడంతో చర్చలు నడుస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని సమసిపోయేలా చేయాలనీ చూస్తోంది. సుకుమార్ సినిమాకు మంచి టాక్ వస్తే బడ్జెట్ అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు.