Homeటాప్ స్టోరీస్మళ్ళీ పాత రూట్లోకి వెళుతున్న త్రివిక్రమ్

మళ్ళీ పాత రూట్లోకి వెళుతున్న త్రివిక్రమ్

Over Budget for Ala Vaikunthapuramulo
Over Budget for Ala Vaikunthapuramulo

త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మాటల మాంత్రికుడు, గురూజీ అని సంభోదిస్తుంటారు తన అభిమానులు. నిజమే త్రివిక్రమ్ తన పదునైన సంభాషణలతో మాయ చేయగలడు. నిజానికి త్రివిక్రమ్ ను దర్శకుడిగా కన్నా మాటల రచయితగానే ఇష్టపడతారు చాలా మంది. త్రివిక్రమ్ ఎందుకంటే ఇష్టం అనగానే తన టేకింగ్ అనేకంటే తన రైటింగ్ అనే సమాధానమే ఎక్కువ వస్తుంది. త్రివిక్రమ్ లో డైరెక్టర్ కన్నా రైటర్ ఎక్కువ డామినేట్ చేస్తుంటాడు. చాలాసార్లు తన రైటింగ్ తోనే సీన్లను బతికిస్తుంటాడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర ఒక నెగటివ్ పాయింట్ కూడా ఉంది. బడ్జెట్ విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు, బిజినెస్ లెక్కలపై పెద్దగా కంట్రోల్ కూడా ఉండదు. ఒక సినిమాకు ఎంత బిజినెస్ అవుతుందో అంతా ఖర్చు పెట్టిస్తుంటాడు. ఒక్కోసారి నెగటివ్ లో ఉండి నిర్మాత సినిమాను అమ్ముకోవాల్సి వస్తుంది. కాకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతాయి కాబట్టి నిర్మాత సేఫ్ అవుతాడు, భారీ రేట్లు కారణంగా బయ్యరు స్వల్ప లాభాలతో ఊపిరి పీల్చుకుంటాడు.

అయితే అజ్ఞాతవాసి సినిమాతో బిజినెస్ లెక్కల్లో తేడాలొచ్చేసాయి. త్రివిక్రమ్ క్రెడిబిలిటీ మీదే సందేహాలు రేకెత్తించిన సినిమా అజ్ఞాతవాసి. బ్యాడ్ రైటింగ్ తో పాటు బడ్జెట్ అదుపుతప్పిపోవడం కూడా అజ్ఞాతవాసి విషయంలో నెగటివ్ అయింది. దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాత సినిమా అరవింద సమేత విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. బడ్జెట్ విషయంలో నిర్మాతలా ఆలోచించి పెద్దగా ఖర్చు పెట్టలేదు. కేవలం ఒకే ఒక్క ఫారిన్ షెడ్యూల్ వేసాడు. పాటలన్నీ మాంటేజ్ లో, ఇండోర్ లో సెట్ వేసి కానిచ్చేశాడు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల అరవింద సమేత ఓ మోస్తరు హిట్ అయినా కూడా బాగా మిగిలాయి. జరిగిన బిజినెస్ కంటే అయిన బడ్జెట్ చాలా తక్కువ. నిర్మాతకు బంగారు పంట పండించింది అరవింద సమేత.

- Advertisement -

అయితే ఇదే ట్రెండ్ కొనసాగించి ఉంటే బాగుండేది కానీ, ఇప్పుడు చేస్తున్న అల వైకుంఠపురములో చిత్రం ద్వారా త్రివిక్రమ్ మళ్ళీ రూట్ తప్పాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా అల వైకుంఠపురములో నిలుస్తోంది. అల్లు అర్జున్ మార్కెట్ స్థాయిని మించి త్రివిక్రమ్ ఈ చిత్రానికి ఖర్చు పెట్టిస్తున్నాడట. అవసరం లేకపోయినా ఫారిన్ షెడ్యూల్స్ వేస్తున్నాడు. మాంటేజ్ లో తీసే స్కోప్ ఉన్న సామజవరగమన పాటను ఫ్రాన్స్ లో అత్యంత ఖరీదైన లొకేషన్స్ లో చిత్రీకరించాడు.

పారిస్ లో కూడా ఈ సాంగ్ షూట్ చేసాడు. అల వైకుంఠపురములో బడ్జెట్ అదుపుతప్పి వెళ్లిందని ట్రేడ్ చెబుతోంది. అందుకనే ఈ సినిమాకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారని తెలుస్తోంది. తద్వారా భారీ బిజినెస్ ను ఆకర్షించవచ్చని త్రివిక్రమ్ ప్లాన్. ఇలా అయితే మళ్ళీ నిర్మాత సేఫ్ అవుతాడు భారీ రేట్లు పెట్టి కొనుక్కున్న బయ్యర్లు సినిమా ఏదయినా తేడా కొడితే ఏమవుతారు అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All