Homeటాప్ స్టోరీస్నాగార్జున ఇంటిని ముట్టడించిన స్టూడెంట్స్

నాగార్జున ఇంటిని ముట్టడించిన స్టూడెంట్స్

Nagarjuna House
Nagarjuna House

కింగ్ నాగార్జున ఇంటిని ముట్టడించారు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ . బిగ్ బాస్ 3 కి నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తుండటంతో ఓయు స్టూడెంట్స్ ఇంతకుముందే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసారు . చెప్పినట్లుగానే నాగార్జున ఇంటిని ముట్టడించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఓయూ స్టూడెంట్స్ .

దాంతో నాగార్జున ఇంటి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . ఒకేసారి పెద్ద ఎత్తున యువకులు నాగార్జున ఇంటిని ముట్టడించడానికి రావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అడ్డుకొని అరెస్ట్ చేసారు . అయితే కొంతమంది అత్యుత్సాహం ఉన్నవాళ్లు పోలీసులను దాటుకొని వెళ్ళడానికి ప్రయత్నించారు . ఓయూ స్టూడెంట్స్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగానే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు పోలీసులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All