
భీమ్లా నాయక్ మూవీ తో హిట్ అందుకున్న రానా..ప్రస్తుతం విరాట పర్వం అనే సినిమా పూర్తి చేసి రిలీజ్ కోసం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో విరాటపర్వం థియేటర్లలోకి రాలేకపోతుంది.
ఈ క్రమంలో ఈ సినిమాకు ఓటిటి నుండి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మాతలకు దాదాపు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందట. రూ.41 కోట్లు డిజిటల్ రిలీజ్ కోసం, రూ.9 కోట్లు శాటిలైట్ హక్కుల కోసం అందజేస్తామని సదరు ఓటీటీ సంస్థ ముందుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఉందా అనేది తెలియాలి.
- Advertisement -