Homeటాప్ స్టోరీస్విడుదలైన రెండు వారాలకే ఆన్లైన్ లో సినిమా.. అంతా ప్రైమ్ మాయ

విడుదలైన రెండు వారాలకే ఆన్లైన్ లో సినిమా.. అంతా ప్రైమ్ మాయ

operation gold fish in amazon prime in just two weeks
operation gold fish in amazon prime in just two weeks

ఇదివరకు పైరసీ అనేది సినిమా వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టేది. సినిమా విడుదలైన రెండో రోజుకే పైరసీ ప్రింట్ నెట్ లో హల్చల్ చేసేది. కానీ ఆ ప్రింట్ అంత క్లారిటీ ఉండేది కాదు. కక్కూర్తి ఉండే వాళ్ళు, థియేటర్ కు వెళ్లకుండా ఆ పైరసీ ప్రింట్ ను చూసి సంతృప్తి పడిపోయారు. సినిమా విడుదలైన మరో రెండు వారాలకు మంచి ప్రింట్ నెట్ లో దర్శనమిచ్చేది. దాంతో థియేటర్ కు వచ్చే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ తాకిడి పెరగడంతో పైరసీ భూతాన్ని తరిమికొట్టచ్చని నిర్మాతలు, దర్శకులు, హీరోలు అభిప్రాయపడ్డారు. దర్జాగా ఇంట్లో కూర్చుని మంచి ప్రింట్ దొరలాగా చూసుకోవచ్చు కాబట్టి పైరసీని పెద్దగా నెటిజన్లు పట్టించుకోరు అని ఆశపడ్డారు. వారి అంచనా మొదట్లో నిజంలానే కనిపించింది. పైరసీ చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ థియేటర్ కు వచ్చే వారి సంఖ్య పెరగలేదు సరికదా మరింతగా దిగజారిపోయింది. థియేటర్ యాజమాన్యాలు అమెజాన్ ప్రైమ్ రాకతో మరింత తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి.

- Advertisement -

ఎంతగా రూల్స్ సెట్ చేసుకుంటున్నా ఎక్కడో చోట నిర్మాత కక్కూర్తి పడడంతో అమెజాన్ ప్రైమ్ లో చాలా త్వరగా సినిమాలు దర్శనమిస్తున్నాయి. పైగా సినిమా పోస్టర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రైమ్ అని వేస్తుండడంతో అక్కడ వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇదివరకు సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసేవారు.

కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ఇప్పుడా అన్న ఆరాలు మొదలయ్యాయి. స్ట్రీమింగ్ రంగంలో మిగతా సైట్స్ ఉన్నా కానీ అవి ప్రైమ్ లా మరీ నెల రోజులకే సినిమాలను విడుదల చేయవు. ప్రైమ్ అయితే మరీ ఘోరంగా పెద్ద సినిమాలకైతే 30 రోజులు, చిన్న సినిమాలకైతే వారాల వ్యవధిలో విడుదల చేసేస్తోంది. ముందుగానే చేసుకున్న డీల్స్ కావడంతో నిర్మాతలు కూడా గమ్మున ఉండక ఏం చేయలేకపోతున్నారు.

దీనికి పెర్ఫెక్ట్ ఉదాహరణగా ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ గురించి చెప్పుకుంటున్నారు. అక్టోబర్ 18న విడుదలైన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ను అక్టోబర్ 31న ప్రైమ్ లో విడుదల చేసారు. అంటే మరీ రెండు వారాల్లో. ఇలా మరీ రెండు వారాల్లోనే సినిమాలు సైట్స్ లో వచ్చేస్తుంటే ఇక ఏ ప్రేక్షకుడైనా థియేటర్ కు ఎందుకు వెళ్తాడు? ఎందుకు వెళ్ళాలి? ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కష్టాలన్నీ దాటుకుని అక్టోబర్ 18న థియేట్రికల్ రిలీజ్ అయితే చాలా సులువుగా ప్రైమ్ లోకి వచ్చేసింది.

విడుదలైనప్పుడు డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వసూళ్లపరంగా ఘోరాతి ఘోరంగా మారిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ప్రైమ్ లో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందో చూడాలి. ఈ చిత్రంతో హీరోగా ఆది కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లే అని అంటున్నారు విశ్లేషకులు. ఆది హీరోగా హిట్ కొట్టి చాలా ఏళ్ళయిపోతోంది. కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావట్లేదు కాబట్టి ఇక హీరోగా అతనికి అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All