Homeటాప్ స్టోరీస్సినిమా బాగుపడాలంటే అందరు చెప్పేవారే కానీ....సినిమాని బాగా తీసేవారు లేరుగా...

సినిమా బాగుపడాలంటే అందరు చెప్పేవారే కానీ….సినిమాని బాగా తీసేవారు లేరుగా…

సినిమా బాగుపడాలంటే అందరు చెప్పేవారే కానీ....సినిమాని బాగా తీసేవారు లేరుగా...
సినిమా బాగుపడాలంటే అందరు చెప్పేవారే కానీ….సినిమాని బాగా తీసేవారు లేరుగా…

ఒక చిన్న సినిమాతో కొత్త దర్శకులు మరియు కొత్త హీరోలు-హీరోయిన్స్ పరిచయం అవుతారు సినిమా ప్రపంచానికి . వారు సినిమా మీద బాగా నమ్మకంతో కష్టపడి పని చేస్తారు. సినిమా జనాల అందరికి రీచ్ అయ్యేలా బాగా ప్రమోషన్స్ చేస్తారు. ఆ సినిమా విజయం అయ్యిందో ఇక అంతే సంగతి వెనక్కి తిరిగి చూసుకోరు అలా పరిగెడుతూనే ఉంటారు. పుసుక్కున మధ్యలో ఫ్లాప్ అయ్యిందో ఇదిగో ఇలా మాట్లాడుతారు….

‘సినిమా విజయం అవ్వాలంటే సినిమా విడుదల అయ్యిన రోజున కాకుండా ఒక వారం రోజుల తర్వాత రివ్యూలు రాస్తే బాగుంటుంది. సినిమా విడుదల అయ్యిన రోజు నుండి వారం రోజుల దాకా సినిమాకి ప్రమోషన్స్ చేసుకుంటే అప్పుడు ఆ సినిమా కొంతైనా ఆడుతుంది’ అన్నారు. మరి అలా అన్నది ఎవరు అంటే ఆయన పేరు చెప్పినా మీరు కనిపెట్టలేకపోవచ్చు. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్‘ సినిమా చూసిన వారికి గాని, లేదా సినిమా ప్రమోషన్స్ చూసిన వారికి కానీ తెలిసిపోతుంది ఆయన పేరు ‘కార్తీక్ రాజు’ అని.

- Advertisement -

మరి అలా కార్తీక్ రాజు మాట్లాడటం వెనుక కారణం ఆయన సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పట్టడం. పడేసావే, కౌసల్య కృష్ణ మూర్తి ఇప్పుడు ఈ  ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా కార్తీక్ రాజు కి కోరుకున్న హిట్ దక్కనివ్వలేదు. సినిమాని జనాలకి రీచ్ అవ్వాలంటే మొదట కథ, కథనం దగ్గర నుండి మొదలు పెట్టాలి కానీ ఇలాంటి సినిమాలు తీసి  జనాలు నచ్చట్లేదు అంటే మీరు అలాంటి మాటలు చెప్పటం వలన ఎమన్నా ఉపయోగమా? అని జనాలు అనుకుంటున్నారు.

ఇక హీరోగా నటించిన ‘ఆది సాయికుమార్‘ సమస్య కూడా పెద్దదే. అప్పుడెప్పుడో వచ్చిన ‘ప్రేమ కావలి’ మరియు ‘లవ్ లీ’ సినిమాలు తప్ప చెప్పుకోవడానికి ఒక్క సరైన హిట్టు కూడా లేదు మనోడికి. వరుసగా 10 సినిమాలు మన వారికి ఫ్లాపులు ఇచ్చాయి. అందులో ఒక్క ‘శమంతకమణి’ సినిమా తప్ప మిగిలినవి ఏవి అంతగా ఆడలేదు. ఇప్పటికే చాలా మంది సినిమా ప్రియులు నీకు యాక్టింగ్ రాదు, కథా ఎంపిక తెలియదు, నువ్వు ఇంకా సినిమాలు చేయకపోవడమే మంచిది అని సలహాలు ఇస్తున్నారు. మరి ఇలాంటి దీన స్థితిలో ఆది ని చూసి ఒక్క దర్శకుడు అయినా ముందుకు రాకపోతాడా? అని సాయికుమార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి నిర్మాతలు ముందుకు రావాలి కదా అంటున్నారు విమర్శకులు.

ఒక్క సినిమా సరిగ్గా ఆడకపోతేనే చాలా జాగ్రతలు తీసుకునే కుర్ర హీరోలు ఉన్న మన తెలుగు పరిశ్రమలో ఆది సాయికుమార్ కి మాత్రం ఎందుకు ఇలాంటి పెద్ద విషయం తన మెదడుకి పట్టడం లేదు అని తన మీద కూసింత కోపంగానే ఉన్నారు జనాలు. ఇలానే ఉంటే తన మొదటి ఇన్నింగ్స్ కి ముగింపు చెప్పుకొని కొన్ని రోజులు ఆగి రెండవ ఇన్నింగ్స్ ని మొదలు బెట్టాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All