Homeన్యూస్బిగ్ బాస్ 5: నామినేషన్స్ నుండి తప్పించుకున్నది ఇద్దరే ఇద్దరు

బిగ్ బాస్ 5: నామినేషన్స్ నుండి తప్పించుకున్నది ఇద్దరే ఇద్దరు

బిగ్ బాస్ 5: నామినేషన్స్ నుండి తప్పించుకున్నది ఇద్దరే ఇద్దరు
బిగ్ బాస్ 5: నామినేషన్స్ నుండి తప్పించుకున్నది ఇద్దరే ఇద్దరు

బిగ్ బాస్ 5 ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. హౌజ్ లో ఇంకా 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఐదుగురు ఫైనల్స్ కు వెళతారు, మిగతా ఆరుగురు రానున్న ఆరు వారాల్లో ఎలిమినేట్ అవుతారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అవ్వడంతో ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రానున్న వారాలు అందరికీ చాలా కీలకం కానున్నాయి.

ఈరోజు అత్యంత కీలకమైన నామినేషన్స్ ఎపిసోడ్ జరుగుతుంది. ఈరోజు విడుదలైన రెండు ప్రోమోలను బట్టి చూస్తుంటే నామినేషన్ ప్రక్రియ ఫుల్ ఫైర్ తో జరగనుందని తెలుస్తోంది. ఒకరినొకరు మొహం ఫోమ్ కొట్టి మరీ నామినేట్ చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం హౌజ్ లో అందరూ నామినేషన్స్ లోకి వెళ్లారు. షణ్ముఖ్ జస్వంత్ కెప్టెన్ కావడంతో నామినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు.

- Advertisement -

అలాగే ఎన్నీ మాస్టర్ కూడా నామినేషన్స్ లోకి రాగా ఒక టాస్క్ లో గెలుచుకున్న స్పెషల్ పవర్ ను ఉపయోగించి ఆమె నామినేషన్స్ నుండి సేవ్ అయింది. దీంతో ఇద్దరు తప్ప హౌజ్ లో ఉన్న వారందరూ నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శల స్థాయి కూడా ఓ రేంజ్ లో ఉందని అర్ధమవుతోంది. మొత్తంగా చూసుకుంటే రవి, శ్రీరామ్ చంద్ర, మానస్, సన్నీ, ప్రియాంక, కాజల్, సిరి, జెస్సీ, విశ్వలు నామినేషన్స్ లోకి వచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All