Homeటాప్ స్టోరీస్విక్ట‌రీ నుంచి మ‌రో సర్‌ప్రైజ్ రెడీ!

విక్ట‌రీ నుంచి మ‌రో సర్‌ప్రైజ్ రెడీ!

విక్ట‌రీ నుంచి మ‌రో సర్‌ప్రైజ్ రెడీ!
విక్ట‌రీ నుంచి మ‌రో సర్‌ప్రైజ్ రెడీ!

2019లో సోలోగా కాకుండా వ‌రుణ్‌తేజ్‌తో `ఎఫ్‌2`, మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో `వెంకీ మామ‌` చిత్రాల్లో న‌టించిన వరుస‌గా విజ‌యాల్ని అందుకున్నారు విక్ట‌రీ వెంక‌టేష్. 2019 ప్రారంభంలో `ఎఫ్‌2`తో సాలీడ్ హిట్‌ని సొంతం చేసుకున్న వెంకి మేన‌ల్లుడితో చేసి `వెంకీమామ` ఆ స్థాయిలో కాక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది. 2020లో సోలోగా ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని ఫిక్స‌యిన వెంక‌టేష్ అందుకు త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్‌`ని ఎంచుకున్న విష‌యం తెలిసిందే.

వెంక‌టేష్ హీరోగా `అసుర‌న్` ఆధారంగా `నార‌ప్ప‌` తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల అనంత‌పురంలోని రూర‌ల్ ఏరియాలో లాంఛనంగా మొద‌లైన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడ‌క్షన్స్ డి. సురేష్‌బాబుతో క‌లిసి త‌మిళ నిర్మాత క‌లైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ప్రియ‌మ‌ణి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా వుంద‌ట‌. ఇటీవ‌ల కొంత మంది యంగ్ హీరోయిన్‌ల‌ని ప‌రిశీలించిన చిత్ర బృందం ఫైన‌ల్‌గా పేరున్న హీరోయిన్‌నే సెలెక్ట్ చేసుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అమ‌లా పాల్ అయితే స‌హ‌జంగా వుంటుంద‌ని ఆమెని సంప్ర‌దిస్తే అమ‌లాపాల్ వెంట‌నే అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల నార‌ప్ప ఏజ్డ్ లుక్‌ని రిలీజ్ చేసిన మేక‌ర్స్ త్వ‌ర‌లో యంగ్ లుక్‌ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All