
వెండితెరపై కుర్రాకారని మెస్మరైజ్ చేసిన పేరు సిల్క్ స్మిత. 80 – 90 వ దశకంపై యువకుల కలల రాణిగా మెరిపింది. స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపట్ల. సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాస్త సిల్క్ స్మితగా మారింది. మత్తెక్కించే కళ్లతో 17 ఏళ్ల పాటు తెలుగు, తమిళ, మలయాళ 450 చిత్రాల్లో నటించి అంతలోనే మరపురాని లోకాలకు వెళ్లిపోయింది.
17 ఏళ్ల సినీ కెరీర్‌లో స్మిత వున్న సినిమా అంటే పెద్దల నుంచి ముసలి వాళ్ల వరకు మనసు పడేవారు. ఒక్క పాటలో సిల్క్ మెరిసినా ఆ పాట కోసమైనా సినిమాకు వెళ్లే వారంటే సిల్క్ స్మిత ఏ స్థాయిలో అన్ని ఏజ్‌ల వారిని మెస్మరైజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఇప్పటికే `డర్టీపిక్చర్` రూపొందించి. సిల్క్ పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు జాతీయ పురస్కారాన్ని అందించింది.
ఇన్నేళ్ల తరువాత మళ్లీ సిల్క్ జీవితంపై ఓ సినిమా రాబోతోంది. అయితే ఇది తెలుగులో కాదు తమిళంలో. `అవల్ అప్పడిదాన్` పేరుతో ఈ చిత్రాన్ని కె. ఎస్. మణికండన్ రూపొందిస్తున్నారు. నవంబర్‌లో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఇందులో సిల్క్ పాత్రలో ఎవరు నటిస్తారు అన్నది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.