Homeటాప్ స్టోరీస్ప్రభాస్ - అనుష్క ల చుట్టూ మళ్ళీ గుసగుసలు

ప్రభాస్ – అనుష్క ల చుట్టూ మళ్ళీ గుసగుసలు

once again rumours on prabhas and anushkaప్రభాస్ కు పెళ్లి కాలేదు , అలాగే అనుష్క కు కూడా పెళ్లి కాలేదు పైగా ఇద్దరూ కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు . ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది అంతేకాదు ప్రేక్షకుల మన్ననలను పొందిన జంట కావడంతో చాలాకాలంగా ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వస్తూనే ఉన్నాయి అలాగే ఎప్పటికప్పుడు ఆ గుసగుసలకు ప్రభాస్ లేదా అనుష్క సమాధానం ఇస్తూనే ఉన్నారు ఏంటంటే …… ” అబ్బే ! మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్న సంబంధం ఏది లేదు కానీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ” .

ఇలా చాలారోజులుగా చెబుతూనే ఉన్నారు కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ – అనుష్క ల పై గుసగుసలు మొదలయ్యాయి . వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని . ప్రభాస్ పెళ్లి అదిగో ఇదిగో అంటూ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది అలాగే అనుష్క పెళ్లి కూడా సేమ్ టు సేమ్ దాంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తోంది . ఎవరో ఒకరు ముందుగా పెళ్లి చేసుకుంటే కానీ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు . సాహో షూటింగ్ జరుగుతున్న చోట కూడా అనుష్క కనిపిస్తోందట దాంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది . ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంతో బిజీ గా ఉన్నాడు దాని తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All