Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ మళ్ళీ ఆ డైరెక్టర్ తో

అల్లు అర్జున్ మళ్ళీ ఆ డైరెక్టర్ తో

once again allu arjun teamup with director krish అల్లు అర్జున్ తాజాగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అల్లు అర్జున్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు , ఓవర్ సీస్ లో ఎలాగున్నా ఇండియాలో మాత్రం బాగా ఆడుతుందని నమ్మకంగా ఉన్నాడు . మేలో ఆ చిత్రాన్ని విడుదల చేస్తుండగా అప్పుడే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్లో పెడుతున్నాడు .

ఇప్పటికే వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్న అల్లు అర్జున్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో కూడా నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది . అల్లు అర్జున్ కెరీర్ తొలినాళ్ళ లో క్రిష్ దర్శకత్వంలో ” వేదం ” అనే చిత్రంలో నటించాడు , ఆ సినిమా కమర్షియల్ హిట్ కాలేదు కానీ అల్లు అర్జున్ కు మాత్రం నటుడిగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది దాంతో మళ్ళీ ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలనీ ఉత్సాహ పడుతున్నాడట . గత ఏడాది బాలయ్య తో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రాన్ని క్రిష్ తీసిన విషయం తెలిసిందే ……. ప్రస్తుతం మణికర్ణిక అనే బాలీవుడ్ చిత్రం చేస్తున్నాడు క్రిష్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All