
ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్ కు సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సినిమా పెద్ద విజయం సాధించి సరికొత్త రికార్డ్స్ ను నమోదు చేస్తున్న తరుణంలో ఒలివియా మోరిస్..ఎన్టీఆర్ ఫై ఆసక్తికర కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ..ఎన్టీఆర్ ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ తో వర్క్ చేస్తున్న సమయంలో చాలా విషయాలను నేర్చుకోవచ్చు అన్నట్లుగా తెలిపింది. నర్వస్ గా ఉన్న సమయంలో ఆయన చిరు నవ్వు చూసి చాలా వరకు రిలాక్స్ అయ్యేదాన్ని అంటూ ఒలివియా పేర్కొంది. ఈమె కామెంట్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ..మార్చి 25 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రెండు వారాలు పూర్తి అయ్యేలోపే వరల్డ్ వైడ్ గా 900 కోట్లు క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక నార్త్ లోను వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 200 కోట్లు క్రాస్ చేసి పలు బాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేసింది.