Homeటాప్ స్టోరీస్స్నేహం గొప్ప‌త‌న్నాన్ని చాటే విభిన్న‌మైన గేమ్ షో ` ఓ మై ఫ్రెండ్‌`

స్నేహం గొప్ప‌త‌న్నాన్ని చాటే విభిన్న‌మైన గేమ్ షో ` ఓ మై ఫ్రెండ్‌`

oh my friend game show, based on friendshipహెచ్ బి డి – హ్య‌క్‌డ్ బై డెవిల్ అనే సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ లాగిన్ మీడియా ప్ర‌స్తుతం మ‌రో రెండు సినిమాల‌ను రూపొందిస్తుంది. ప్ర‌స్తుతం స్నేహం, స్నేహితులు అనే విభిన్న‌మైన కాన్సెప్ట్‌తో.. ఇప్పుడు జ‌రుగుతున్న గేమ్ షోల‌కు భిన్నంగా.. ప్లాన్ చేసిన గేమ్ షో `ఓ మై ఫ్రెండ్`తో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైంది. చ‌లాకీ చంటి, విష్ణుప్రియ ఈ షోకు యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో వి.పాండు రంగారావు, ఉద‌య్ భాస్క‌ర్ గౌడ్ నిర్మాత‌లుగా షో రూపొందుతోంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

ఉద‌య్ భాస్క‌ర్ గౌడ్‌ మాట్లాడుతూ “మా లాగిన్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలో ఆల్ రెడీ ఉంది. ఇప్పుడు టీవీల్లోకి కూడా అడుగుపెట్టాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. అందుక‌ని ఓ గేమ్ షో ప్లాన్ చేశాం. ఓ మై ఫ్రెండ్ అనేది గేమ్ షో టైటిల్‌. ఈ గేమ్ షోకి వ‌డ్డేప‌ల్లి పాండు రంగారావుగారు నిర్మాత‌ల్లో ఒక‌రు. మా ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆశీర్వదించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

- Advertisement -

చ‌లాకీ చంటి మాట్లాడుతూ – “లాగిన్ మీడియా సంస్థ చేస్తున్న ఈ గేమ్‌షోకి నేను, విష్ణుప్రియ యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాం. వీలైనంత ఎంట‌ర్‌టైనింగ్‌గా గేమ్‌షో ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నాను. ఓ మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు? ఇద్ద‌రు స్నేహితులు ఎలా అయ్యారు? స్నేహం ఎందుకు బ‌ల‌ప‌డింది? అనే విష‌యాల‌ను చెబుతూ ఓ గేమ్ షోను ప్లాన్ చేశాం. లాగిన్ సంస్థ ప్ర‌య‌త్నాల‌ను స‌క్సెస్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకంటున్నాను“ అన్నారు.
విష్ణుప్రియ మాట్లాడుతూ “చంటిగారితో క‌లిసి ఓ గేమ్ షో చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. లాగిన్ సంస్థ స్నేహం అంశంపై గేమ్ షో చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. క‌చ్చితంగా ఈ గేమ్ షో అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు.

డైరెక్ట‌ర్ ర‌మేశ్ మాట్లాడుతూ – “ఈ షో టెలికాస్ట్ అయిన రోజు నుండి అంద‌రినీ మెప్పిస్తుంది“ అన్నారు.
వి.పాండు రంగారావు మాట్లాడుతూ “ మంచి కాన్సెప్ట్ ఉన్న గేమ్ షో ఓ మై ఫ్రెండ్‌. ప్రేక్ష‌కులు ఈ షోను విజ‌యవంతం చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో కెమెరామెన్ మోహ‌న్‌చంద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All