Homeటాప్ స్టోరీస్ఓ బేబీ రివ్యూ ( Oh Baby Review )

ఓ బేబీ రివ్యూ ( Oh Baby Review )

Oh Baby Review
Oh Baby Review

ఓ బేబీ రివ్యూ 
నటీనటులు : సమంత , లక్ష్మీ , రాజేంద్రప్రసాద్ , నాగశౌర్య
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : D. Suresh Babu, Sunitha Tati, T.G.Vishwa Prasad, Hyunwoo Thomas Kim
దర్శకత్వం : నందిని రెడ్డి
రేటింగ్ : 3.5 /5 
రిలీజ్ డేట్ : 5 జూలై 2019

సమంత , రాజేంద్రప్రసాద్ , లక్ష్మీ ,నాగశౌర్య , రావు రమేష్ తదితరులు నటించిన చిత్రం ” ఓ బేబీ ”. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :
యుక్తవయసులోనే భర్తని కోల్పోయి పిల్లలతో కలిసి ఉంటున్న బేబీ ( లక్ష్మీ ) కి చాదస్తం ఎక్కువ . దాంతో ఆమె మితిమీరిన ప్రేమని భరించలేక బేబీ ని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతారు . ఓల్డ్ ఏజ్ హోమ్ కెళ్లాకా వయసు మళ్ళిన బేబీ యంగ్ బేబీ ( సమంత ) గా మారుతుంది . 70 ఏళ్ల ముసలావిడ యువతిగా ఎలా మారింది ? అలా మారిన తర్వాత జరిగిన అల్లరి ఏంటి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
సమంత
ఫస్టాఫ్
ఎంటర్ టైన్ మెంట్
డైరెక్షన్
రాజేంద్రప్రసాద్
లక్ష్మీ
రావు రమేష్ 
క్లైమాక్స్

డ్రా బ్యాక్స్ :
సెకండాఫ్ లో కొన్ని సీన్స్

నటీనటుల ప్రతిభ :
బేబీ గా సమంత నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ! ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో మైలురాళ్లని అధిగమించింది సమంత అయితే ఆ చిత్రాలన్నీ ఒక ఎత్తు ఓ బేబీ చిత్రం ఒక ఎత్తు అని చెప్పడంలో సందేహమే లేదు . కెరీర్ బెస్ట్ చిత్రాల్లో తప్పకుండ ఓ బేబీ అగ్రస్థానంలో నిలబడుతుంది. బేబీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించింది . అంతేకాదు సీనియర్ నటి లక్ష్మీ ని తలపించడం అంటే మాటలు కాదు సుమా ! మహానటి అయిన లక్ష్మి యంగ్ క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించింది సమంత .

ఇక సీనియర్ నటి లక్ష్మి గురించి కొత్తగా చెప్పేదేముంది , ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించే అద్భుతమైన నటి లక్ష్మి యధావిధిగా తన పాత్రలో మెప్పించింది . అలాగే రాజేంద్రప్రసాద్  బాయ్ ఫ్రెండ్ పాత్రలో అద్భుతమనే చెప్పాలి . ఆ చిలిపి తనం , హుషారు కలగలిపి బాయ్ ఫ్రెండ్ గా అలరించాడు . రావు రమేష్ , నాగశౌర్య తదితరులు కూడా తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు . ఇక సమంత , లక్ష్మి , రాజేంద్రప్రసాద్ , రావు రమేష్ లు ఎమోషనల్ సీన్స్ తో గుండెని పిండేసారు .

సాంకేతిక వర్గం :
కొరియన్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ తెలుగుతెరపై అద్భుతంగా ఆవిష్కరించింది నందిని రెడ్డి . చక్కని ఎంటర్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ తో కట్టిపడేసింది నందిని . అసలు తన చిత్రంలో పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకొని అక్కడే విజయాన్ని అందుకుంది .

మేటి నటీనటులు ఉండటంతో నందిని రెడ్డి పని చాలా సులువు అయ్యింది . ఫస్టాఫ్ ని , క్లైమాక్స్ ని అద్భుతంగా తీర్చి దిద్దింది అయితే సెకండాఫ్ కాస్త ఎక్కువ అనిపించింది . కొన్ని సన్నివేశాలు కట్ చేస్తే బెటర్ గా ఉండొచ్చేమో కానీ ఓవరాల్ గా సాలిడ్ హిట్ కొట్టేసింది నందిని . మిగతా టెక్నికల్ టీమ్ కూడా అద్భుతంగా పనిచేసింది కాబట్టే ఈ అవుట్ పుట్  వచ్చింది .

ఓవరాల్ గా :
మస్ట్ అండ్ వాచ్ ఓ బేబీ

Click Here: Oh Baby Review in English

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All