Homeటాప్ స్టోరీస్టీఆర్పీ రేటింగ్ లో NTV తోపు..

టీఆర్పీ రేటింగ్ లో NTV తోపు..

NTV topped BARC rating
NTV topped BARC rating

బ్రేకింగ్.. బ్రేకింగ్.. బ్రేకింగ్.. ఎన్టీవీ హవా కొనసాగుతోంది. తగ్గేదేలె.. అంటూ గత 16 వారాలుగా BARC రేటింగ్స్ లో టాప్ లో దూసుకెళ్తోంది. బ్రేకింగ్ న్యూస్ అందించడంలో ది బెస్ట్ గా నిలుస్తోంది. డిబేట్ల పేరిట సొల్లు పురాణాల్లేవ్. సూటిగా.. సుత్తి లేకుండా… నిర్భయంగా.. నిజాయితీగా న్యూస్ ను ప్రజెంట్ చేస్తూ.. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నది. రాజకీయ పార్టీల అజెండాలు మోస్తూ.. ఆస్థాన టీవీ ఛానెల్స్ గా చలామణి అవుతున్న మీడియా పట్ల విసుగెత్తిన జనాలకు ఎన్టీవీ వరంగా దొరికింది. స్టోరీ బోర్డ్, స్పీడ్ న్యూస్, ఆఫ్ ది రికార్డ్, ఫోకస్ న్యూస్ అంటూ జనాల ఫోకస్ గ్రాప్ చేస్తోంది. ఎనీ న్యూస్.. వాచ్ ది ఎన్టీవీ అంటూ నెం. 1 స్థానంలో కొనసాగుతోంది.

ఇటీవల కాలంలో న్యూస్ చానెల్స్ అనేవి పుట్టగొడుగుల్లా వెలిసాయి. కానీ వీటిలో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ వార్తలను, సరికొత్త కథనాలను , డిబేట్ లను , ప్రత్యేక ఇంటర్వూస్ ను అందించే చానెల్స్ మాత్రం పదిలోపే. ఈ పది లోపు చానెల్స్ మాత్రమే ప్రస్తుతం టాప్ రేటింగ్ కోసం పోటీపడుతుంటాయి. ఒకప్పుడు బ్రేకింగ్ వార్తలైన, సినీ ప్రముఖుల ఇంటర్వ్యూ లైన , సినీ , రాజకీయ ఈవెంట్ లైన, తాజా వార్తలన్నా సరే టక్కుమని tv9 చూసేవారు. ఆ రేంజ్ లో వారు మొదట్లో కవర్ చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత దానిని నిలుపుకోలేకపోయారు.

- Advertisement -

ప్రస్తుతం ఎవరైన సరే..రాజకీయ నేతలు , సామాన్య ప్రజలు , క్రీడా అభిమానులు , బిజినెస్ వ్యాపారస్థులు ఇలాఎవరైన NTV వార్తలనే ఇష్టపడుతున్నారు. దీనికి కారణం రాజకీయ విశ్లేషణ , స్టోరీ బోర్డు , ఫోకస్ న్యూస్ ..స్పీడ్ గా వార్తలను ప్రజలకు చేరవేయడం..అఫ్ ది రికార్డు ప్రోగ్రామ్స్ వంటివి అందిస్తుండడం తో NTV ని ఇష్టపడుతూ ఛానల్ మార్చకుండా చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలాన ఏం జరిగిన అది పెద్ద సంఘటనైనా..చిన్న సంఘటనైనా..దొంగతనమైన, అత్యాచారమైన…ప్రవైట్ దోపిడైన..ప్రభుత్వ నిర్లక్షమైన..ఇలా ఏదైనా సరే ఆ క్షణం ప్రజలకు అందజేస్తూ ప్రజల మనసు ను గెలుచుకుంటుంది. ఒకే రకమైన డిబేట్ లు, వార్తలు కాకుండా ప్రస్తుతం ఏంజరుగుతుంది.. ప్రజలు ఏమికోరుకుంటున్నారు..ఎలాంటి కథనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు.. ఆ ఆ నియోజకవర్గంలో అధికార నేత పని తీరు ఎలా ఉంది..ఏ ఏ మంత్రులు ప్రజలకు ఎలాంటి మంచి చేస్తున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు..ఏ ఊరిలో ఎలాంటి కష్టాలు ఉన్నాయి..వారికీ ఏంకావాలి..ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుంటూ..వారి కష్టాలను అధికార పార్టీల నేతలకు, ప్రతిపక్ష పార్టీల నేతలకు. ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం NTV నే చూస్తూ వస్తున్నారు. గత 16 వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో BARC రేటింగ్ లో NTV నెం.1గా కొనసాగుతూ వస్తుంది. 82 రేటింగ్ పాయింట్లతో NTV మొద‌టి స్థానంలో ఉంటె TV9 58, V6 30, TV5 24, ABN 18 రేటింగ్స్ తో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ ఛానల్ పొజిషన్ చూసి మిగతా చానెల్స్ కు NTV ని ఉదాహరణగా తీసుకొని పనిచేయడం మొదలుపెడుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All