Homeగాసిప్స్ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది అప్పుడే!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది అప్పుడే!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది అప్పుడే!
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది అప్పుడే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి గతంలో అరవింద సమేత అనే ఒక సీరియస్ కథను చెప్పడానికి ప్రయత్నించారు. దానికి ప్రేక్షకులు డీసెంట్ మార్కులిచ్చి హిట్ చేసారు లెండి. అయితే ఈసారి వీరిద్దరూ కలిసి ఒక ఫన్ ఫిల్మ్ చేయబోతున్నట్లు సమాచారం. పూర్తిగా హిలేరియస్ కథతో, విలువలు వంటి వాటినేమి టచ్ చేయకుండా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేసారు. ఇప్పటికే కథ లాక్ అయిపోయింది. త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నాడు. డైలాగ్ వెర్షన్ తో కలిపి మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయిపోతాయి.

వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పుడో తెలిసినా, ఇప్పుడిప్పుడే ఈ సినిమా గురించి సమాచారం అందుతోంది. తాజా న్యూస్ ప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది మేలో ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో పూర్తి బిజీగా ఉన్నాడు. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ తన వెర్షన్ ను మార్చ్ నెలాఖరు కల్లా పూర్తి చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక నెల బ్రేక్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. అలాగే రెండు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ చేసిన తర్వాత ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చి ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఆర్ ఆర్ ఆర్ చాలా ప్రతిష్టాత్మక చిత్రం. పైగా 10 భాషల్లో విడుదలవుతోంది. దాదాపు 400 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లకు కనీసం రెండు నెలలు కావాలి. త్రివిక్రమ్ సినిమాకు మధ్యలో బ్రేక్ ఇచ్చి ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్లలో పాల్గొని ఆ వర్క్స్ పూర్తైన తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయాలని ప్రాధమికంగా ప్లాన్ చేసుకున్నారు.

- Advertisement -

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే త్రివిక్రమ్ సినిమాను వచ్చే సంక్రాంతికి దించేయవచ్చు. ప్లానింగ్ బాగుంది, మరి అనుకున్న ప్రకారమే జరుగుతుందా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All