Homeటాప్ స్టోరీస్ఎవరు మీలో కోటీశ్వరులు - పది రోజులు కేటాయించిన ఎన్టీఆర్

ఎవరు మీలో కోటీశ్వరులు – పది రోజులు కేటాయించిన ఎన్టీఆర్

ఎవరు మీలో కోటీశ్వరులు - పది రోజులు కేటాయించిన ఎన్టీఆర్
ఎవరు మీలో కోటీశ్వరులు – పది రోజులు కేటాయించిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగేళ్ల తర్వాత మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. బిగ్ బాస్ ను హోస్ట్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్ గా మారాడు. నిజానికి ఈ కార్యక్రమం ఏప్రిల్ లోనే లాంచ్ కావాలి కానీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా వాయిదా పడింది.

జులై 7 నుండి ఎన్టీఆర్ ఈ షో షూటింగ్ లో పాల్గొంటాడని వార్తలు వచ్చాయి కానీ అనుకోని కారణాల వల్ల రెండు రోజులు వెనక్కి వెళ్ళింది. ఈ వీకెండ్ నుండి 10 రోజుల పాటు ఎన్టీఆర్ ఈ షో షూటింగ్ లో పాల్గొంటాడు. వీలైనన్ని ఎక్కువ ఎపిసోడ్స్ ను షూట్ చేసేలా ప్లాన్ చేసారు. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ 10 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

- Advertisement -

ఈ నెలాఖరు నుండి మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటాడు ఎన్టీఆర్. ఉక్రెయిన్ లో ఒక సాంగ్ ను చిత్రీకరించాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All