Homeటాప్ స్టోరీస్`ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి షాకిస్తున్న వ‌రుస లీకులు!

`ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి షాకిస్తున్న వ‌రుస లీకులు!

`ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి షాకిస్తున్న వ‌రుస లీకులు!
`ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి షాకిస్తున్న వ‌రుస లీకులు!

భారీ చిత్రాల‌కు ఈ మ‌ధ్య లీకుల బెడ‌ద ఓ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా వ‌రుస లీకులు అవుతూనే  వున్నాయి. దీంతో మేక‌ర్స్ త‌ల‌ప‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి. టెక్నాల‌జీ పెరిగిపోయిన నేప‌థ్యంలో చిన్న స్మార్ట్ ఫోన్ కూడా భారీ చిత్రాల‌కు పెను స‌వాల్‌గా మారుతోంది. తాజాగా లీకుల భారీన జ‌క్క‌న్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌` ప‌డుతోంది.

ఈ మూవీ స్టార్టింగ్ నుంచి లీకుల భారిన ప‌డుతోంది. రామ్‌చ‌ర‌ణ్ బ్ర‌టీష్ అధికారి గెట‌ప్‌లో వున్న ఫొటోలు.. ఎన్టీఆర్ డీప్ ఫారెస్ట్‌లో పులితో ఫైట్ చేస్తున్న ఫొటోలు ఇటీవ‌ల లీజ్ అయ్యాయి. తాజాగా పులితో ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్న వీడియో అంటూ ఓ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఉద్దేశ పూర్వ‌కంగానే ఎవ‌రైనా లీక్ చేస్తున్నారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలే వున్నాయి. ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టే సినిమాని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ స‌న్నివేశాల‌ని  హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ నిక్ పావెల్ చిత్రీక‌రిస్తున్నారు. ఇంత‌లోనే ఎన్టీఆర్‌కి సంబంధించిన స‌న్నివేశాలు లీక్ కావ‌డం ఆర్ ఆర్ ఆర్ టీమ్‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్నిఅక్టోబ‌ర్ 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All