Homeటాప్ స్టోరీస్తారక్... అన్నయ్య బ్యానర్ ను వదలట్లేదు

తారక్… అన్నయ్య బ్యానర్ ను వదలట్లేదు

తారక్... అన్నయ్య బ్యానర్ ను వదలట్లేదు
తారక్… అన్నయ్య బ్యానర్ ను వదలట్లేదు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ హీరోగా ఇండస్ట్రీలో చలామణీ అవుతున్నాడు. ఆర్ ఆర్ ఆర్, తర్వాత కొరటాల శివ చిత్రం, ప్రశాంత్ నీల్ తో సినిమా.. ఇలా వరసగా ఎన్టీఆర్ టాప్ సినిమాలు చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మినహాయిస్తే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ ను తన చిత్రాల్లో భాగస్వామిని చేయడం.

ముందుగా త్రివిక్రమ్ తో సినిమాలో కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ను భాగస్వామిని చేసాడు ఎన్టీఆర్. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థానంలో కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు తారక్. మిక్కిలినేని సుధాకర్ ఒక నిర్మాత కాగా కళ్యాణ్ రామ్ కు కూడా వాటా ఉంది. దాని స్థానంలో ఇది అని అనుకున్నారు కానీ ప్రశాంత్ నీల్ చిత్రంలో కూడా కళ్యాణ్ రామ్ భాగస్వామే.

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు ప్రధానంగా డబ్బు పెట్టేది. నిజానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ ద్వారా కళ్యాణ్ రామ్ సంపాదించిన దానికన్నా పోగొట్టుకున్నది ఎక్కువ. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నాడు తారక్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All