Homeగాసిప్స్ఎన్టీఆర్ సరసన దీపికా పదుకునే..?

ఎన్టీఆర్ సరసన దీపికా పదుకునే..?

ntr romance deepika padukone
ntr romance deepika padukone

ఆర్ఆర్ఆర్ మూవీ తో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్..త్వరలో తన 30 వ చిత్రం కొరటాల శివ డైరెక్షన్లో మొదలుపెట్టబోతున్నారు. జూన్ నెలలో ఈ మూవీ సెట్స్ పైకి రానుందని సమాచారం. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి భారీ విజయం అందుకోవడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత kGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేయనున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబదించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన దీపికా పదుకునే ను ఎంపిక చేయాలనీ ప్రశాంత్ ఆలోచిస్తున్నాడట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ నెలలో స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది.

- Advertisement -

ప్రస్తుతం కెజిఫ్ 2 ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు ప్రశాంత్..ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All