Homeటాప్ స్టోరీస్పందెం కోడి కోసం ఎన్టీఆర్ చరణ్ పోటీ పడ్డారట

పందెం కోడి కోసం ఎన్టీఆర్ చరణ్ పోటీ పడ్డారట

NTR Ram Charan tried to remake Pandem Kodi2005 లో తెలుగులో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం పందెం కోడి . తమిళంలో పందెం కోడి ప్రభంజనం సృష్టించింది. ఆ సినిమాతో పరిచయమైన విశాల్ తెలుగులో కూడా సంచలన విజయం అందుకున్నాడు. అయితే తమిళ్ లో పందెం కోడి సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ఎన్టీఆర్ , రాంచరణ్ లు పోటీ పడ్డారట . ఎన్టీఆర్ , చరణ్ లు రీమేక్ హక్కుల కోసం పోటీపడినప్పటికి విశాల్ తండ్రి మాత్రం ఆ హక్కులను ఇవ్వడానికి నిరాకరించాడట . ఇంతకీ తెలుగు హక్కులు ఎన్టీఆర్ , చరణ్ లకు ఇవ్వలేదో తెలుసా ……. విశాల్ తెలుగు కుర్రాడు కావడమే కారణం.

విశాల్ తెలుగు వాడు అయినప్పటికీ చెన్నై లో పెరగడం వల్ల తమిళ్ చిత్రాల్లో నటించాడు. అయితే పందెం కోడి హిట్ కావడంతో తెలుగులో ఈ చిత్ర హక్కులు ఎవ్వరికీ ఇవ్వకుండా రీమేక్ లేదా డబ్ చేయాలని అనుకున్నాడట విశాల్ తండ్రి . అయితే రీమేక్ సరిగా రాకపోతే ఎలా ? అని డబ్ చేసాడు కట్ చేస్తే పందెం కోడి సంచలన విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు పందెం కోడి 2 వస్తోంది. అక్టోబర్ 18న పందెం కోడి రిలీజ్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా విశాల్ కు 25వ సినిమా కావడం.

- Advertisement -

English Title: NTR Ram Charan tried to remake Pandem Kodi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All