Homeటాప్ స్టోరీస్RRR రిలీజ్ డేట్ ఫిక్స్.. జనవరి 7న గ్రాండ్ రిలీజ్..!

RRR రిలీజ్ డేట్ ఫిక్స్.. జనవరి 7న గ్రాండ్ రిలీజ్..!

NTR Ram Charan Rajamouli RRR Release Date

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే రిలీజైన టీజర్ తో సినిమాపై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా ఎట్టకేలకు ఫైనల్ రిలీజ్ డేట్ ప్రకటించింది. అక్టోబర్ 13న రిలీజ్ అని ఈమధ్య రిలీజ్ డేట్ ప్రకటించగా దాన్ని వాయిదా వేస్తూ ఫైనల్ గా 2022 జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

సంక్రాంతికి వారం ముందు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యాం, పవన్.. రానా ల భీమ్లా నాయక్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు రేసులో ఆర్.ఆర్.ఆర్ కూడా వస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All