
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు వారం మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ వీలైనంత స్పీడ్ గా సినిమాను దేశ వ్యాప్తంగా ప్రోమోట్ చేయాలనీ చూస్తున్నారు. ఇప్పటికే పలు మీడియా లలో వరుస ఇంటర్వూస్ ఇస్తూ వస్తున్న టీం..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి ని ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రీమియర్ షో కు ప్రభాస్ వస్తాడా అని ప్రశ్నించగా..తప్పకుండా వస్తాడని తెలిపారు.
భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు.
- Advertisement -
- Advertisement -