
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అఖండ. డిసెంబర్ 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచనున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను పిలిచే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. బాబాయ్ సినిమాకు అబ్బాయి ప్రమోషన్స్ చేయడం కామనే. అలానే బాలయ్య సినిమాకు తారక్ గెస్ట్ గా వస్తాడని అంటున్నారు. బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ముగ్గురు ఒకేస్టేజ్ పై కనిపించి నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు.
ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచింది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆ రెండు సినిమాలను మించి సూపర్ హిట్ అయ్యేలా ఉందని అంటున్నారు. సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. అఖండ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటించారు. సినిమా తప్పకుండా నందమూరి అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చెప్పుకుంటున్నారు.