Homeటాప్ స్టోరీస్వైఫ్‌కు భారీ గిఫ్ట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌!

వైఫ్‌కు భారీ గిఫ్ట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌!

వైఫ్‌కు భారీ గిఫ్ట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌!
వైఫ్‌కు భారీ గిఫ్ట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌!

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుంత `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూట్‌లో బిజీగా వున్న ఆయ‌న ఫ్యామిలీకి కూడా కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. భార్య‌‌ ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. ఇటీవల మార్చి 18 న ఎన్టీఆర్ వైఫ్ ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పుట్టినరోజు జ‌రిగింది. పుట్టిన రోజుని గ్రాండ్‌గా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా హీరో ఎన్టీఆర్ త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తికి అత్యంత ఖ‌రీదైన బ‌హుమ‌తిని పుట్టిన రోజు కానుక‌గా అందించార‌ట‌. ఆ కానుక ఫామ్ హౌస్ అని తెలిసింది. ఇదే ఫామ్ హౌస్‌లో ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పుట్టిన రోజు వేడుక‌ల‌ని కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో నిర్వ‌హించార‌ట‌. ఈ ఫామ్ హౌస్ ఖ‌రీదు భారీగానే వుంటుంద‌ని చెబుతున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నివ‌చ్చే నెల 13న లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న‌తో చేస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All