Homeటాప్ స్టోరీస్మంచు మనోజ్ ని అభినందిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

మంచు మనోజ్ ని అభినందిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Ntr fans praises manchu manojకన్నతండ్రి చనిపోయి దు:ఖసాగరంలో ఉన్న ఎన్టీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన మంచు మనోజ్ ని అభినందిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . నందమూరి హరికృష్ణ చనిపోయిన సమయంలో ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకంటే ఎన్టీఆర్ ని , కళ్యాణ్ రామ్ ని చూడటానికి ఎగబడ్డ వాళ్ళే ఎక్కువ దాంతో ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ రద్దీ ఎక్కువయ్యింది పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ ని దగ్గరగా చూడటానికి మీదమీదకు వస్తున్న సమయంలో ఎన్టీఆర్ వెన్నంటే ఉండి బౌన్సర్ లా వ్యవహరించిన వ్యక్తి మంచు మనోజ్ .

- Advertisement -

ఎన్టీఆర్ – మంచు మనోజ్ ల పుట్టినరోజు ఒకటే అలాగే ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు . ఎన్టీఆర్ అలాగే మంచు మనోజ్ చిన్నప్పుడు ఇద్దరు కూడా విపరీతమైన అల్లరి చేసేవాళ్ళట ! అయితే ఎన్టీఆర్ మాత్రం కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను చేరుకోవడంతో అల్లరి స్థానంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు . అయితే ఎన్టీఆర్ ని చూసే క్రమంలో చాలామంది ఎన్టీఆర్ మీదకు వస్తుండటంతో అతడ్ని సంరక్షించే బాధ్యత మంచు మనోజ్ తీసుకున్నాడు . అసలే భారీ కాయం కావడంతో ఎన్టీఆర్ పక్కనే ఉంటూ చాలామందిని నిలువరించాడు కూడా . ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు కాగా మంచు మనోజ్ మాత్రం సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడు .

English Title: ntr fans praises manchu manoj

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts