Homeటాప్ స్టోరీస్అరాచక సంస్కృతి ఆపేయండి.. ఏపీ ప్రభుత్వానికి ఎన్.టి.ఆర్ వార్నింగ్..!

అరాచక సంస్కృతి ఆపేయండి.. ఏపీ ప్రభుత్వానికి ఎన్.టి.ఆర్ వార్నింగ్..!

NTR Comments on Bhuvaneswari Issue

ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో శుక్రవారం అసెంబ్లీ నుండి బాయ్ కాట్ చేయడమే కాకుండా ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఇక ఈ అంశంపై నందమూరి ఫ్యామిలీ చాలా సీరియస్ అయ్యింది. ఫ్యామిలీ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మరి వైసీపీ నాయకులను ఎటాక్ చేసింది.

- Advertisement -

ఇక మరోపక్క యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అందరికి నమస్కారం.. మాట మన వ్యక్తిత్వానికి సమానం.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం అంటూ మొదలు పెట్టిన ఎన్.టి.ఆర్ విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి కానీ, వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని అన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నా మనసుని కలచి వేసిందని అన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో.. ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుందని అన్నారు. రాజకీయ నాయకులందరికి ఒక్కటే విన్నపం. దయచేసి ఈ అరాచక సంసృక్తిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి.. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే.. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని అన్నారు ఎన్.టి.ఆర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All