Homeటాప్ స్టోరీస్మహానటి ని రిజెక్ట్ చేసి తప్పు చేసిన ఎన్టీఆర్

మహానటి ని రిజెక్ట్ చేసి తప్పు చేసిన ఎన్టీఆర్

ntr blunder mistake  ntr rejected mahanatiయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మహానటి చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ని పోషించాలని స్వప్న వెళ్లి అడిగినప్పటికీ మహానటి లో నటించకుండా పెద్ద తప్పు చేసాడు జూనియర్ ఎన్టీఆర్ . ఒకవేళ ఎన్టీఆర్ కనుక తాత సీనియర్ ఎన్టీఆర్ పాత్ర పోషించడానికి ఒప్పుకుంటే ఎన్టీఆర్ పాత్ర ని పెద్దగా తీర్చిదిద్దేవారు జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య పాత్ర ని పోషించడానికి వెనుకాడటంతో కేవలం ఒక్క సీన్ కే పరిమితం చేసారు మహానటి చిత్రంలో . నిజానికి సావిత్రి తో ఎన్టీఆర్ చాలా సినిమాలు చేసాడు అంతేకాదు ఆ ఇద్దరి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి .

సావిత్రి – ఎన్టీఆర్ ల మధ్య మంచి అనుబంధం కూడా ఉండేది కానీ ఆ విషయాలు ఇప్పటి జనాలకు తెలియకపోవడానికి కేవలం జూనియర్ ఎన్టీఆర్ నటించకపోవడమే కారణం . ఎన్టీఆర్ పాత్ర ని జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తే తప్పకుండా మహానటి సినిమా రేంజ్ మరోలా ఉండేదని ఇప్పటికే పలు రికార్డులు బద్దలు అయ్యేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి విమర్శకుల ప్రశంసల తో పాటుగా ప్రేక్షకుల రివార్డులను కూడా కొట్టేస్తోంది అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా మహానటి లో నటిస్తే బాగుండేదని , మహానటి ని రిజెక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేసాడని అంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All