Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ లోని అభిమానిని తట్టి లేపింది ఎవరు?

ఎన్టీఆర్ లోని అభిమానిని తట్టి లేపింది ఎవరు?

ఎన్టీఆర్ లోని అభిమానిని తట్టి లేపింది ఎవరు?
ఎన్టీఆర్ లోని అభిమానిని తట్టి లేపింది ఎవరు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తనదైన శైలిలో పుట్టినరోజు విషెస్ తెలియజేసాడు. బాలకృష్ణకు ఈ పుట్టినరోజు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది తన షష్టిపూర్తి 60 వసంతాలు పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా నందమూరి అభిమానుల కోలాహలం మాములుగా లేదు. తన పుట్టినరోజు అయినా కూడా అభిమానులెవరూ బయట వేడుకలు చేయొద్దని బాలకృష్ణ కోరారు. దీంతో సోషల్ మీడియాలోనే నందమూరి అభిమానులు రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సందడి మధ్య ఎన్టీఆర్ ట్వీట్ చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది.

“నాలోని అభిమానిని తట్టి లేపిన మొదటి హీరో. నాకు ఊహ తెలిసాక నేను చూసిన మొట్టమొదటి హీరో మీరే. మీకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జై బాలయ్య” అని ట్వీట్ చేసాడు ఎన్టీఆర్. ఈ విషెస్ నందమూరి అభిమానులు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుందన్న విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు.

- Advertisement -

నేడు తన పుట్టినరోజు సందర్భంగా నిన్న విడుదల చేసిన ఫస్ట్ రోర్ వీడియో కూడా అభిమానులకు పండగను తీసుకొచ్చాయి.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All