2019 సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుందని బాలయ్య ప్రకటించాడు . ముందుగా ఈ సినిమాకు దర్శకులు తేజ పైగా దసరా కానుకగా విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకోవడంతో పలు దర్శకుల పేర్ల ని పరిశీలించి ఎట్టకేలకు క్రిష్ ని ఎంపిక చేసాడు బాలయ్య . క్రిష్ – బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే .
అసలు ఎన్టీఆర్ బయోపిక్ ని సమర్థవంతంగా తెరకెక్కించే దర్శకుడు క్రిష్ అని , అతడి ఎంపిక బాలయ్య తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అంటూ కితాబు నిస్తున్నారు . త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతి కి విడుదల చేయాలనీ నిర్ణయించు కున్నారు . రిలీజ్ డేట్ లాక్ కావడంతో ఆ లోపు సినిమాని పూర్తిచేసే పని పెట్టుకున్నారు క్రిష్ , బాలయ్యలు . ఎన్టీఆర్ బయోపిక్ పై బాలయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇదొక క్లాసికల్ గా నిలిచిపోవాలని ఆశిస్తున్నాడు బాలయ్య . తిరుగులేని చరిత్ర ఎన్టీఆర్ ది , మరి ఆ చరిత్రకారుడి జీవితాన్ని వెండితెర పై ఎలా ఆవిష్కరిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే .