Homeగాసిప్స్బాలయ్య - ఎన్టీఆర్ కలిసి కనిపించనున్నారా?

బాలయ్య – ఎన్టీఆర్ కలిసి కనిపించనున్నారా?

బాలయ్య - ఎన్టీఆర్ కలిసి కనిపించనున్నారా?
బాలయ్య – ఎన్టీఆర్ కలిసి కనిపించనున్నారా?

నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. అయితే ఇద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడడం తక్కువే. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బాలయ్య ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి మాట్లాడుతూ వాడికి సినిమాల్లో బోలెడంత భవిష్యత్తు ఉంది. మరి రెండిటినీ బ్యాలన్స్ చేసుకోగలడో లేదో వాడే నిర్ణయించుకోవాలి అని అన్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి కనిపించి చాలా కాలమే అయినా త్వరలోనే అది జరగనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇది తనకు షష్టిపూర్తి కావడంతో అందరూ చాలా గ్రాండ్ గా ఈ ఫంక్షన్ ను చేయాలని నిర్ణయించుకున్నారు. భారీ ఎత్తున బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయని సమాచారం. ఆ రోజు సాయంత్రం బాలయ్య ఇండస్ట్రీలో అందరినీ ఆహ్వానించి పార్టీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

సో ఈ వేడుకలకు ఎన్టీఆర్ కూడా వస్తారని, ఇద్దరూ కలవడాన్ని చూడొచ్చని నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విధంగా చిరంజీవి – బాలయ్య, నాగార్జున – బాలయ్య కూడా కనిపిస్తే చూడాలని సినిమా అభిమానులు కోరుకుంటున్నారు. మరి చూడాలి ఇది ఎంత వరకూ నిజమవుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All