Homeటాప్ స్టోరీస్సిగరెట్ తాగుతున్న పిక్స్ కి యమా క్రేజ్

సిగరెట్ తాగుతున్న పిక్స్ కి యమా క్రేజ్

NTR and ANR Smoking Pic goes VIRALఇద్దరు లెజెండ్స్ నందమూరి తారకరామారావు ,అక్కినేని నాగేశ్వర్ రావు లు కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది . ఎన్టీఆర్ అక్కినేని అనగానే నిజంగానే వాళ్లే అనుకుంటారు అంత అద్భుతంగా వచ్చింది ఫోటో , అయితే ఇద్దరు లెజెండ్స్ సిగరెట్ తాగుతున్న ఫోటోల్లో ఉన్నది బాలయ్య , సుమంత్ లు . ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా ఏఎన్నార్ గా సుమంత్ నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈరోజు మహానటుడు అక్కినేని నాగేశ్వర్ రావు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయమే అక్కినేని గెటప్ లో ఉన్న సుమంత్ లుక్ ని రిలీజ్ చేయగా దానికి అద్భుత స్పందన వచ్చింది .

కట్ చేస్తే రెస్పాన్స్ బాగా రావడంతో సాయంత్రానికి మరో పిక్ రిలీజ్ చేసారు . ఇక ఈ పిక్ లో ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య అక్కినేని గెటప్ లో సుమంత్ సిగరెట్ తాగుతున్నారు . ఇక ఈ లుక్ కి అయితే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది . మళ్ళీ ఎన్టీఆర్ – అక్కినేని లను చూసిన ఫీలింగ్ కలుగుతోంది అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు . క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: NTR and ANR Smoking Pic goes VIRAL

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All