Homeటాప్ స్టోరీస్ఇప్పుడు పెళ్లీలు ఎంత ఫాస్ట్‌గానో .. అంతే ఫాస్ట్‌గా విడాకులు!

ఇప్పుడు పెళ్లీలు ఎంత ఫాస్ట్‌గానో .. అంతే ఫాస్ట్‌గా విడాకులు!

ఇప్పుడు పెళ్లీలు ఎంత ఫాస్ట్‌గానో .. అంతే ఫాస్ట్‌గా విడాకులు!
ఇప్పుడు పెళ్లీలు ఎంత ఫాస్ట్‌గానో .. అంతే ఫాస్ట్‌గా విడాకులు!

ఏళ్ల తరబడి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత అనుకోని కారణాలవల్ల మనస్పర్ధలతో విడాకులు తీసుకొని విడిపోవడం అన్నది కామన్ గా మారిపోయింది. ఇక రాను రాను అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కనీసం ఏడాది కూడా కలిసి ఉండకముందే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి ఘ‌ట‌న సినీ ఇండ‌స్ట్రీలో చాలా జ‌రుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే దానిని ఒక పరమ పవిత్ర బంధం గా భావించేవారు. కానీ ఇప్పుడు పెళ్లీలు ఎంత ఫ‌స్ట్‌గా జ‌రుగుతున్నాయో.. అంతే ఫ‌స్ట్‌గా విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పుడు అలాంటి ఓ సెల‌బ్రెటీల పెళ్లికి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

ప్రముఖ తమిళ్ సీరియల్ నటి మహాలక్ష్మీ.. బడా ప్రొడ్యూసర్ రవిందర్ చంద్రశేఖర‌న్‌ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. చూడ‌ముచ్చ‌టైన జంట అంటూ ఆ కొత్త జంట‌ను ఆశీర్వ‌దిస్తున్నారు. తిరుపతిలో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే ఇక్క‌డ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వీరిద్దరికి ఇదివరకే పెళ్లిళ్లు అయ్యాయి. వారి భాగస్వాములతో విడిపోయిన వీరు గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు. ఇక ఇప్పుడు మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. తమ పెళ్లి ఫోటోలను నిర్మాత రవీందర్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ స్పెషల్ నోట్ రాసుకొచ్చారు. వాణి రాణి, ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్, ఒరు కై ఒసై వంటి సీరియల్స్ ద్వారా మహాలక్ష్మీ మంచి గుర్తింపు పొందారు. ఇక లిబ్ర ప్రొడక్షన్ సంస్థ అధినేత రవీందర్ నిర్మించనున్న రెండు చిత్రాల్లోనూ మహాలక్ష్మీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. నువ్వు నా జీవితంలో ఉండడం నా అదృష్టం.. నీ ఆప్యాయత నా జీవితం.. లవ్ యూ అమ్ము.. అంటూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది మహాలక్ష్మీ. ఇక రవీంధర్.. సుత్త కాదై, నలనుం నందినియుమ్, శాంత్ను – అతుల్య, మురుంగైక్కై చిప్స్ మొదలైన చిత్రాలను నిర్మించారు. రవీంధర్ ప్రముఖ టెలివిజన్ షో బిగ్ బాస్ కు సంబంధించి యూట్యూబ్ ఇంటర్వ్యూలతో విస్తృత ప్రజాదరణ పొందారు.

- Advertisement -

 

View this post on Instagram

 

A post shared by Pradeep R Chinna (@pradeeprchinna)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All