Homeటాప్ స్టోరీస్పుష్పలో ఐటెం సాంగ్ కు ఎంపికైన ఫారిన్ భామ!!

పుష్పలో ఐటెం సాంగ్ కు ఎంపికైన ఫారిన్ భామ!!

పుష్పలో ఐటెం సాంగ్ కు ఎంపికైన ఫారిన్ భామ!!
పుష్పలో ఐటెం సాంగ్ కు ఎంపికైన ఫారిన్ భామ!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్పను రెండు భాగాలుగా చిత్రీకరిస్తోన్న విషయం తెల్సిందే. ఇందులో మొదటి భాగం పుష్ప ది రైజ్ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా నటిస్తోండగా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో తనకు పెయిర్ గా చేస్తోంది.

ఇక శ్రీవల్లి సెకండ్ సింగిల్ ను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నారు. అలాగే పుష్పకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక స్పెషల్ నెంబర్ ఉందిట. అసలు సుకుమార్ సినిమాలు అంటేనే స్పెషల్ నెంబర్స్ కు పెట్టింది పేరు. పుష్పలో  కూడా అదిరిపోయే ట్యూన్ ను సిద్ధం చేసాడట దేవి శ్రీ ప్రసాద్. సుకుమార్ – డిఎస్పీ కాంబినేషన్ లో ఉన్న పాటలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అన్న విషయం తెల్సిందే.

- Advertisement -

ఇక ఈ స్పెషల్ నెంబర్ లో చేయడానికి ఫారిన్ భామ నోరా ఫతేహిను దించుతున్నట్లు తెలుస్తోంది. ఆమెను అయితే అప్రోచ్ అయ్యారు కానీ ఇంకా నోరా డేట్స్ ఇవ్వలేదట. తెలుగులో టెంపర్, బాహుబలి 1 చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది నోరా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All