Homeన్యూస్బిగ్ బాస్ 5: ఈసారి ఆ ట్రెండ్ ఉండదట

బిగ్ బాస్ 5: ఈసారి ఆ ట్రెండ్ ఉండదట

బిగ్ బాస్ 5: ఈసారి ఆ ట్రెండ్ ఉండదట
బిగ్ బాస్ 5: ఈసారి ఆ ట్రెండ్ ఉండదట

బిగ్ బాస్, ది బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇన్ తెలుగు ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తైన ఈ షో ఇప్పుడు తొమ్మిదో వారంలో కూడా ఆసక్తికరంగా నడుస్తోంది. అలాగే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా మరో 11 మంది హౌజ్ లో ఉన్నారు.

సాధారణంగా బిగ్ బాస్ షో ఒక ఫార్మాట్ ప్రకారమంటూ నడవదు. ముందుగా హౌజ్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది. షో మధ్యలో ఒకరు లేదా ఇద్దరు హౌజ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. మొదటి సీజన్ లో వైల్డ్ కార్డ్ గా ఎంటర్ అయిన నవదీప్ ఎంతటి ఫన్ ను జనరేట్ చేసాడో మనం చూసాం. అలాగే గత సీజన్ లో అయితే ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డులుగా షో లో ఎంట్రీ ఇచ్చారు. కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, అవినాష్ లు వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇవ్వగా అవినాష్ అందరిలో సూపర్ సక్సెస్ అయ్యాడు.

- Advertisement -

అయితే సీజన్ 5 లో మాత్రం ఈ తరహా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదని తెలుస్తోంది. హౌజ్ లో ఉన్న 11 మంది కాకుండా మరొకరు ఎంట్రీ ఇవ్వరని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకూ నిజమో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All