Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు దూరంగా ఉన్న త్రివిక్రమ్..కారణం ఏంటి..?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు దూరంగా ఉన్న త్రివిక్రమ్..కారణం ఏంటి..?


పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ఈరోజు బుధువారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కన్నుల పండుగగా జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా మంత్రులు కేటీఆర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరయ్యారు. వేడుక అంత కూడా పవర్ స్టార్ అభిమానులతో చాల గ్రాండ్ గా జరిగింది. ఇదే ఈవెంట్ లో మరో ట్రైలర్ విడుదల చేసి ఆకట్టుకున్నారు. ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రులు , ఎమ్మెల్యే లు పవన్ గురించి , సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుందో అని అంత ఆసక్తి గా ఎదురుచూసారు. అయితే పవన్ కేవలం సినిమా గురించి , ఆయన గత సినిమాల గురించి మాట్లాడారు తప్ప రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడాడలేదు. చాలామంది ఏపీ సర్కార్ ఫై విమర్శలు చేస్తారని అనుకున్నారు కానీ పవన్ మాత్రం ఏమి మాట్లాడకుండా సినిమా గురించి మాట్లాడి సెలవు తీసుకున్నారు. అయితే ఈ వేడుకలు ఇద్దరు లేని లోటు స్పష్టంగా కనిపించింది. వారే త్రివిక్రమ్ , బండ్ల గణేష్ లు.

- Advertisement -

పవన్ సినిమా ఫంక్షన్ అంటే పవన్ స్పీచ్ కంటే వీరిద్దరి స్పీచ్ ల కోసమే చాలామంది ఎదురుచూస్తారు. కానీ ఈ ఇద్దరు మాత్రం వేడుకలో కనిపించలేదు. త్రివిక్రమ్ ..ఫంక్షన్ కు వచ్చారు కానీ వేదిక పైకి రాలేదు. దీనికి కారణం ఏంటో అర్ధం కావడం లేదు. సినిమాకు వెన్నుముక త్రివిక్రమ్ అని అంత చెప్పారు..మేకింగ్ వీడియోస్ లలో స్టిల్స్ లలో చూసాం. అలాంటిది త్రివిక్రమ్ వేదిక ఫైకి రాకపోవడం , మాట్లాడక పోవడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇక బండ్ల గణేష్ కు సంబదించిన ఓ ఆడియో క్లిప్ రెండు రోజుల క్రితం వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానం అందలేదని..తనకు ఆహ్వానం అందకుండా చేసింది త్రివిక్రమే అని ఓ ఆడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఆడియో ఫై బండ్ల గణేష్ స్పందిస్తూ..అందులో ఉన్నది నా వాయిస్ కాదని చెప్పారు. కానీ ఇప్పుడు వేడుక లో ఆయన కనిపించకపోయేసరికి..అంత ఆ ఆడియో లో ఉన్నది గణేష్ వాయిసే అని స్పష్టం చేస్తున్నారు. పవన్ తో విభేదాలు వస్తాయనే గణేష్ ఆలా చెప్పాడని..నిజంగా గణేష్ కు ఆహ్వానం అందలేదని..అందితే రాకుండా ఉంటాడా అని అంత మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి త్రివిక్రమ్ ,గణేష్ స్పీచ్ లేకపోయేసరికి అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All