
యష్ హీరోగా నటించిన చిత్రం `కేజీఎఫ్`. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా `కేజీఎఫ్ -2` రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ దశలో వుంది. 20 రోజులుగా షూటింగ్ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుంది.
సంజయ్‌దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో ఈ చిత్ర షూటింగ్ కూడా ఆగిపోయింది. లాక్‌డౌన్ తరువాత బ్యాలెన్స్‌గా వున్న కీలక షెడ్యూల్‌ని పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే తొలి భాగం రికార్డు స్థాయి వసూళ్లని సాధించడంతో పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే బాలీవుడ్ వెర్షన్ హక్కుల్ని అనిల్ తడాని సొంతం చేసుకున్నారు.
అయితే ఇప్పటికీ తెలుగు హక్కులు మాత్రం ఎవరు సొంతం చేసుకోలేదని తెలిసింది. తొలి పార్ట్‌ని సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. కరోనా క్రైసిస్ కారణంగా పార్ట్ 2ని రిలీజ్ చేయడానికి సాయి కొర్రపాటి ఆసక్తిని చూపించడం లేదట. భారీ మొత్తాన్నిచెల్లించి తెలుగు అనువాద హక్కుల్ని దక్కించుకునే ఆ నిర్మాత ఎవరని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.