
దర్శకధీరుడు ఎస్ ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ అలియాభట్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ నటిస్తోంది. దీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో 350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌తో ఈ మూవీ 75 శాంతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కీలక పాత్రల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ నటిస్తున్నారు. అజయ్ దేవగన్‌కి జోడీగా ఇందులో శ్రియ నటిస్తోంది. ఈ విషయాన్ని శ్రియ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే ఆమెకు ఈ చిత్రంలో ఒక్క పాట కూడా లేదని తెలిసింది. అలియాభట్ – రామ్‌చరణ్ , ఎన్టీఆర్ ఒలివియా మోరీస్‌ల మధ్యే పాటలు వుంటాయని, శ్రియకు వుండవని తెలిసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. అతిథి పాత్ర కావడం వల్లే శ్రయకు పాటలు లేవని తెలిసింది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది.