Homeటాప్ స్టోరీస్`బాహుబ‌లి` న‌టికి సినిమాల్లేవ్?

`బాహుబ‌లి` న‌టికి సినిమాల్లేవ్?

No offers for tamanna
No offers for tamanna

క్రేజ్ వుంటేనే ఎక్క‌డైనా ఎవ‌రికైనా డిమాండ్ వుంటుంది. అదే క్రేజ్ త‌గ్గిపోయిందో.. అవ‌కాశాలు ముఖం చాటేస్తాయి. సినిమా ఇండ‌స్ట్రీలో అయితే ఈ  ప్ర‌భావం తారా స్థాయిలో వుంటుంది. అలాంటి ప‌రిస్థితినే ఓ హీరోయిన్ ఎదుర్కొంటోంది. `బాహుబ‌లి` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. క‌లెక్ష‌న్‌ల ప‌రంగానూ దాదాపు 2 వేల కోట్లు వ‌సూలు చేసి తెలుగు సినిమాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అయితే ఈ చిత్రంలో న‌టించిన న‌టికి సినిమాలు రావ‌డం లేదు.

`బాహుబ‌లి`తో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఓ న‌టికి అవ‌కాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వున్నాయి. ఆమె  మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా. మంచు మ‌నోజ్ న‌టించిన `శ్రీ‌`తో తెలుగు తెర‌కు తెరంగేట్రం చేసిన త‌మ‌న్నా ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో క‌లిపి దాదాపు 60 చిత్రాల్లో న‌టించింది. ఇటీవ‌ల చిరులో క‌లిసి న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`, విశాల్ హీరోగా చేసిన `యాక్ష‌న్‌` చిత్రాలు ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేదు. ఇక నిర్మాణంలో వున్న `క్వీన్` రీమేక్ `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి` రిలీజ్ చిక్కుల్లో ఇరుక్కుంది. అది ఎప్పుడు బ‌య‌టికి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి.

- Advertisement -

దీంతో త‌మ‌న్నా ప‌రిస్థితి చాలా దారుణంగా త‌యారైంది. మ‌హేష్ న‌టిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేస్తోంది. ఇది త‌ప్ప తెలుగులో త‌మ‌న్నాకు సినిమాలేదు. బాలీవుడ్‌లో న‌వాజుద్దీన్ సిద్దిఖీ న‌టిస్తున్న `బోలే చూడియా`లో చేస్తోంది. ఇదే త‌మ‌న్నా చేతిలో వున్న ఏకైక చిత్రం. త‌మ‌న్నా ప‌రిస్థితిని చూసిన వారంతా `బాహుబ‌లి` వంటి భారీ హిట్ చిత్రంలో న‌టించిన న‌టికి సినిమాలు లేక‌పోవ‌డం క్రేజీగా వుంద‌ని వాపోతున్నార‌ట‌. ఇదిలా వుంటే త‌మ‌న్నాకు చాలా వ‌ర‌కు ఐట‌మ్ సాంగ్స్‌లో న‌టించ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All