Homeటాప్ స్టోరీస్2020 లో కూడా షారుఖ్ సినిమా రాకపోవచ్చు

2020 లో కూడా షారుఖ్ సినిమా రాకపోవచ్చు

2020 లో కూడా షారుఖ్ సినిమా రాకపోవచ్చు
2020 లో కూడా షారుఖ్ సినిమా రాకపోవచ్చు

2020 లో కూడా షారుక్ ఖాన్ వెండితెరకు దూరంగా ఉంటున్నారు. గతంలో తాను నటించిన అనేక చిత్రాలు వరుసగా పరాజయం పాలవడంతో పాటుగా, భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసిన జీరో సినిమా కూడా ఘోర పరాజయం పొందడంతో కింగ్ ఖాన్ ఆలోచనలో పడ్డారు. అసలు ప్రాబ్లం ఎక్కడుందా.? అని చెప్పి రీసెర్చ్ చేసి మళ్ళీ, తాను ఏదో ఒక మీటర్ లో సినిమాలు కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా షారుక్ ఖాన్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తరుణంలో, ఆయన తన మిత్రురాలు అయిన ఫరా ఖాన్ ని దర్శకురాలిగా పరిచయం చేస్తూ సినిమాలు చేశారు. అదేవిధంగా రీసెంట్ గా కూడా కొన్ని ఫ్లాపులు పలకరించడంతో, సౌత్ సెంటిమెంట్ నమ్ముకొని చెన్నైఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలను చేసి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు.

షారుక్ ఖాన్ తో వచ్చిన సమస్య ఏమిటంటే ఆయన సినిమా మొదలు పెట్టడం ఎంతో ఆర్భాటంగా, ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారు కానీ; ఆయనకు ఉండే బిజీ షెడ్యూల్స్ వల్ల, దర్శక నిర్మాతలు మరియు క్రియేటివ్ టీం అడిగిన విధంగా కాల్షీట్లు కేటాయించరనే విమర్శలు ఉన్నాయి. టీవీ షో లు, ఈవెంట్ లు, డ్యాన్స్ విడియోలు, ప్రకటనలు, I.P.L టీం ఇలా.. ప్రస్తుతం షారూఖ్ చేతిలో చాలా వెంచర్లు ఉన్నాయి. వీటన్ని మధ్య సినిమాలకు 100 శాతం న్యాయం చెయ్యలేకపోతున్నాని ఆయన అర్ధం చేసుకుని, ప్రస్తుతం తాను డీల్ చేస్తున్న ఈ వ్యవహారాలను నమ్మకస్తులకు ఒక్కొక్కటిగా అప్పగిస్తున్నారు. అయితే తాజాగా షారూఖ్ ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తో సినిమా ఫైనల్ చేసారని తెలుస్తోంది.

- Advertisement -

లైఫ్ సబ్జెక్ట్ లాంటి కథలు తీసుకుని, వాటికి లార్జర్ దెన్ లైఫ్ ట్రీట్మెంట్ తో వరల్డ్ క్లాస్ సినిమాలు తీస్తాడని రాజ్ కుమార్ హిరానికి పేరుంది. గతంలో కూడా అస్సలు ఎవ్వరూ పట్టించుకోని సంజయ్ దత్ తో మున్నాభాయ్ సీరిస్ చేసి, దేశంలో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డు రాజు కుమార్ హిరాణీ కి ఉంది. కాబట్టి తన రీ ఎంట్రీ కి కూడా షారుఖ్, హిరానీ సర్ నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All