Homeటాప్ స్టోరీస్పెళ్లి త‌న‌లో ఎలాంటి మార్పు తీసురాలేద‌ట‌!

పెళ్లి త‌న‌లో ఎలాంటి మార్పు తీసురాలేద‌ట‌!

పెళ్లి త‌న‌లో ఎలాంటి మార్పు తీసురాలేద‌ట‌!
పెళ్లి త‌న‌లో ఎలాంటి మార్పు తీసురాలేద‌ట‌!

టాలీవుడ్ హంక్ రానా ఇటీవ‌లే లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌ను ప్రేమించిన మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. మేలో త‌న ప్రేమ గురించి. ప్రేమించిన అమ్మాయి గురించి వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రానా ఆగ‌స్టు 8న మిహీకాని వివాహం చేసుకున్న విష‌యం ఎలిసిందే. కోవిడ్  కార‌ణంగా వీరి పెళ్లికి కేవ‌లం 30 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

పెళ్లి త‌రువాత కొంత విరామం తీసుకున్న రానా త‌న వైఫ్ మిహీకాలో క‌లిసి హ‌నీమూన్ ట్రిప్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ద‌స‌రా ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా అత్తారింట్లో రానా సంద‌డి చేశారు. భార్య‌తో క‌లిసి తొలిసారి అత్తారింట్లో అడుగుపెట్టిన రానా ద‌స‌రా ఫెస్టివెల్‌ని ఫ్యామిలీ మెంబర్స్ మ‌ధ్య జ‌రుపుకున్నారు.

- Advertisement -

రానా వివాహం జ‌రిగి ఇప్ప‌టికి మూడు నెల‌ల‌వుతోంది. ఈ మూడు నెల‌ల కాలంలో పెళ్లి త‌న జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేద‌ని చెబుతున్నాడు. పెళ్లి త‌రువాత చాలా మంది జీవితాల్లో మార్పు వ‌స్తుంద‌ని, అది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని అంటుంటార‌ని అయితే దాంతో తాను ఏకీభ‌వించ‌న‌ని అంటున్నారు రానా. జీవితంలో పెద్ద‌గా మార్పులు ఏమీ రాలేద‌ని చెప్పిన రానా ఇంత‌కు ముందుకంటే మ‌రింత‌గా బాధ్య‌త‌లు పెరిగాయ‌ని చెప్పుకొచ్చాడు. మిహీకా చాలా జోవియ‌ల్‌గా వుంటుంద‌ని, ఆమెతో ఎక్కువ టైమ్‌ని స్పెండ్ చేస్తున్నాన‌ని చెబుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All