Homeటాప్ స్టోరీస్యాత్ర చిత్రానికి జగన్ డబ్బులు ఇవ్వలేదట

యాత్ర చిత్రానికి జగన్ డబ్బులు ఇవ్వలేదట

No financial support to yatra film from jagan says film makersకీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” యాత్ర ” . అయితే ఈ చిత్రానికి జగన్ లేదా జగన్ మనుషులు డబ్బులు పెట్టి మరీ సినిమా తీయిస్తున్నారు అని గుసగుసలు వినిపించాయి అయితే అవన్నీ గాలి వార్తలు మాత్రమేనని జగన్ డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు ఆ చిత్ర బృందం . మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” యాత్ర ”.

ఈనెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు ఆ చిత్ర బృందం . రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే యాత్ర బయోపిక్ తీశామని , జగన్ మాకు డబ్బులు ఇవ్వలేదని ……. పెద్దగా మాట్లాడలేదని కూడా అంటున్నారు . 2004 కి ముందు పాదయాత్ర చేసిన తర్వాతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే . అదే కథాంశంతో ఈ యాత్ర తెరకెక్కింది .

- Advertisement -

English Title: No financial support to yatra film from jagan says film makers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All