Homeటాప్ స్టోరీస్ఆ సినిమాకు డైరెక్టర్ గా అంటే భయపడుతున్నారు

ఆ సినిమాకు డైరెక్టర్ గా అంటే భయపడుతున్నారు

no-director-for-ntr-biopicఎన్టీఆర్ బయోపిక్ చేయాలనీ నందమూరి బాలకృష్ణ కసిగా ఉన్నాడు కానీ దర్శకుడు మాత్రం సెట్ కావడం లేదు . మొదట తేజ ఈ చిత్రానికి దర్శకుడు , సినిమా ప్రారంభం కూడా అయ్యింది కానీ రెగ్యులర్ షూటింగ్ దగ్గర పడుతున్న సమయంలో తేజ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు . ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎంతో బాధ్యత తో కూడుకున్నదని కాబట్టి నేను చేయగలనా అనే భయం పట్టుకుంది అందుకే తప్పుకున్నాను అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు తేజ దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడి ని ఎంచుకునే పనిలో పడ్డాడు బాలయ్య .

ఎన్టీఆర్ బయోపిక్ అంటే చరిత్ర సృష్టించిన ధీరోదాత్తుడు కథ కాబట్టి దానికి న్యాయం చేయాలంటే సన్నివేశాలు అలా కుదరాలి అంతేగాదు సరైన నటీనటులు కూడా సెట్ అవ్వాలి ,అలా సెట్ కాకపోతే భారీ ఎత్తున విమర్శలు చెలరేగడం ఖాయం అందుకే ఆ సినిమా కు డైరెక్టర్ అంటే భయపడిపోతున్నారు . ప్రస్తుతం రాఘవేంద్రరావు , క్రిష్ , వైవిఎస్ చౌదరి లతో కూడిన ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి . రాఘవేంద్రరావు తో ఎన్టీఆర్ కు ఎంతో అనుబంధం ఉంది కానీ ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి అంతగా సుముఖత చూపడం లేదు . ఒకవేళ బాలయ్య ఒత్తిడి చేస్తే ఒప్పుకుంటాడు , ఇక క్రిష్ తో బాలయ్య కు మంచి బాండింగ్ ఏర్పడింది గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో కాబట్టి క్రిష్ రెండో స్థానంలో ఉన్నాడు ఒకవేళ ఈ ఇద్దరూ నో చెబితే అప్పుడు ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి కి ఛాన్స్ వస్తుంది . అయితే చౌదరి దర్శకుడు గా భారీ పరాజయాలను ఎదుర్కొని దీన పరిస్థితిలో ఉన్నాడు మరి అతడి చేతిలో క్రేజ్ ప్రాజెక్ట్ పెడతారా అంటే డౌటే ! ఎవరూ ముందుకు రాకపోతే బాలయ్యే డైరెక్షన్ కూడా ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All