Homeగాసిప్స్ఇలా అయితే తెలుగులో కష్టమే కార్తీ

ఇలా అయితే తెలుగులో కష్టమే కార్తీ

Karthi
ఇలా అయితే తెలుగులో కష్టమే కార్తీ

సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు కార్తీ. ముఖ్యంగా తనకి అన్నయ్య సూర్య కంటే ముందే తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. విభిన్నమైన చిత్రాలు, పక్కింటి కుర్రాడి తరహా పాత్రలతో తెలుగు వారి ఆదరణను చూరగొన్నాడు. అయితే మధ్యలో కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో తెలుగులో మార్కెట్ కాస్త తగ్గింది. కానీ ఖాకీ సినిమాతో మళ్ళీ తెలుగులో హిట్ కొట్టాడు.

ఇదిలా ఉంటే, కార్తీ ప్రస్తుతం చేస్తున్న ఖైదీ చిత్రంతో తెలుగులో హిట్ కొట్టడం కష్టం అనిపిస్తోంది. ఎందుకంటే ఖైదీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా చాలా తక్కువని అంటున్నారు. కనీసం సినిమాలో పాటలు ఉండవని, కార్తీకి హీరోయిన్ కూడా ఉండదని తమిళ్ మీడియా కథనాలు ప్రచురించింది. డార్క్ యాంగిల్ ఎక్కువగా ప్రొజెక్ట్ అయ్యే ఈ చిత్రం తెలుగు వారికి ఎంత వరకూ ఎక్కుతుందన్నది అనుమానమే. ఖైదీ దీపావళి కానుకగా అక్టోబర్ 26న విడుదల కాబోతోంది. లోకేష్ కంగరాజు దీనికి దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All