
యంగ్ హీరో నిఖిల్ తనకంటూ స్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. తన ఖాతాలో హిట్లు కూడా బానే ఉన్నాయి. అయినా కానీ తన లేటెస్ట్ సినిమాను విడుదల చేసుకోవడంలో విఫలమవుతున్నాడు నిఖిల్. నిజానికి తన తదుపరి చిత్రం అర్జున్ సురవరం గతేడాది విడుదల కావాల్సిన చిత్రం. మొదట ఈ చిత్రం పేరు ముద్ర. అయితే అప్పటికే ఆ పేరుతో మరో సినిమా రిలీజ్ అవడంతో అర్జున్ సురవరంగా టైటిల్ ను మార్చారు.
చాలా ప్రయత్నాల తర్వాత మే 1న చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పటినుండీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ అర్జున్ సురవరం ప్రస్తుతం సోదిలో లేకుండా పోయింది. ఈ సినిమా ప్రస్తుత స్టేటస్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుంది అన్నది తెలీట్లేదు. మరోవైపు నిఖిల్ సూపర్ హిట్ కార్తికేయకు సీక్వెల్ కార్తికేయ 2లో నటించడానికి సన్నద్ధమవుతున్నాడు. చందూ మొండేటి ఈ చిత్రానికి కూడా దర్శకుడు.