
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి సినిమాలకు పూర్తిగా దూరమైపోయాడు. ఇక సినిమాలు అసలు చేయనని వాటి మీద తనకు ఆసక్తి కూడా లేదని వివరించాడు. అయితే రాజకీయాల్లో అనుకున్నట్లుగా తను సక్సెస్ సాధించలేకపోయాడు. రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా పరాజయాన్ని పొందాడు. జనసేనకు కేవలం ఒకటే స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో పవన్ కు ఉన్న రాజకీయ అనిశ్చితిని క్యాష్ చేసుకుందామని సినిమా వాళ్ళు ప్రయత్నించారు. గత ఆరు నెలలుగా పవన్ ను సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
కారణాలు ఏవైనా కానీ పవన్ కళ్యాణ్ మొత్తానికి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ లో పవన్ నటించడానికి సమ్మతం తెలిపాడు. వెంటనే క్రిష్ కూడా పవన్ కు ఒక కథ చెప్పి ఓకే చేయించేసుకున్నాడు. ఇంకేముంది, ఎవరికి వారు పవన్ తో సినిమాలు చేయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసేసారు. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలా మంది పవన్ తన అన్న బాటలోనే నడుస్తున్నాడని, త్వరలోనే జనసేన కూడా విలీనమైపోతుందని విమర్శలు చేసాడు. ఈ విమర్శలు చూసిన పవన్ మళ్ళీ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నాడు. సినిమాల గురించి అడుగుతుంటే నోరు మెదపట్లేదు. గత రెండు మూడు రోజులుగా అధికార పక్షం పైనే ఘాటు విమర్శలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు.
ఈ పరిణామాలు చూసిన సినిమా వాళ్ళు పవన్ తో వచ్చిన ఇబ్బంది ఇదేనని, కచ్చితంగా ఒక దాని మీద స్టాండ్ అవ్వట్లేదు, సినిమాలు చేయనని చెప్పేస్తే ఏ గొడవా ఉండదు, చేస్తానని అంటాడు ఎప్పటినుండో తేల్చడు అంటూ విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఏదొక స్టాండ్ తీసుకుని ఈ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.