ఈనెల 25న నాగశౌర్య హీరోగా నటించిన ” అమ్మమ్మ గారిల్లు ” విడుదల అని అనౌన్స్ చేసారు కానీ ఆ సినిమాకు పెద్దగా బజ్ లేకుండా పోయింది . నాగశౌర్య ఈ ఏడాది ప్రారంభంలో ఛలో సినిమాతో హిట్ కొట్టాడు దాంతో అతడి తదుపరి చిత్రంపై తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది కానీ ఈ చిత్రానికి మాత్రం అంతగా ఊపు కనిపించడం లేదు పైగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా ……. షామిలి . 30 ఏళ్ల ఈ భామ బాలనటి గా తిరుగులేని విజయాలను అందుకుంది . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ లు అందుకుంది .
కట్ చేస్తే హీరోయిన్ గా పరిచయం అయ్యింది కానీ హిట్ కొట్టలేక పోయింది దాంతో ఈ భామని హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు దాంతో కొన్నాళ్ళు సినిమాలు చేయలేదు . తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది షామిలి . అయితే ఈ సినిమాతో అయినా హిట్ కొడుతుందేమో అంటే పెద్దగా బజ్ లేదు సినిమాకు దాంతో అమ్మమ్మ గారిల్లు పరిస్థితి ఏంటో ఈనెల 25న తేలిపోనుంది . అదే రోజున రవితేజ నటించిన ” నేల టిక్కెట్టు ” , నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ” నా నువ్వే ” విడుదల అవుతున్నాయి . మరి ఈ మూడు సినిమాలలో ఏది విజయం సాధిస్తుందో చూడాలి .