Homeగాసిప్స్డిసెంబర్ సినిమాలు... వస్తున్నట్లే తెలీట్లేదు

డిసెంబర్ సినిమాలు… వస్తున్నట్లే తెలీట్లేదు

డిసెంబర్ సినిమాలు... వస్తున్నట్లే తెలీట్లేదు
డిసెంబర్ సినిమాలు… వస్తున్నట్లే తెలీట్లేదు

ఏ సినిమాకైనా బజ్ అనేది చాలా కీలకం. సినిమాపై ఎంత బజ్ ఉంటే ప్రేక్షకులు ఆ సినిమా కోసం అంతలా ఎదురుచూస్తున్నారని అర్ధం. బజ్ లేని సినిమాకు ఓపెనింగ్స్ కూడా రావు. నెమ్మదిగా ప్రేక్షకుల వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిందే. కానీ ప్రస్తుతం సినిమా అనేది వీకెండ్ బిజినెస్ అయిపోయింది. అప్పట్లో 100 రోజులు, 150 రోజులు ఆడే సినిమాలు నిన్నటి వరకూ 50 రోజులైనా ఆడేవి. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలకైతే రెండు వారాలు, చిన్న సినిమాలకైతే వీకెండ్ వరకూ అంతే. ఆ తర్వాత ఆ సినిమాలు ఆడుతున్న థియేటర్లు వెలవెలబోతున్నాయి. అందుకే సినిమాకు బజ్ అనేది చాలా ముఖ్యం. వీలైనంతగా తొలి వీకెండ్ లోనే వసూలు చేసుకోవాలి. మాగ్జిమమ్ తొలి వీకెండ్ లో వచ్చేస్తే మిగతాది తర్వాత ఎంత వచ్చినా బోనస్ కిందే లెక్క. కానీ డిసెంబర్ లో విడుదలయ్యే సినిమాలకు ఎంతమాత్రం బజ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నా కూడా బజ్ అనేది ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.

ముందుగా డిసెంబర్ 5న కార్తికేయ నటించిన 90 ml సినిమా విడుదలవుతోంది. ఆరెక్స్ 100 తో మంచి హిట్ అందుకున్న కార్తికేయ తర్వాత ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. వరసగా రెండు ప్లాపులు తినడం అతని కెరీర్ ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని చేసిన ప్రయత్న 90 ml. అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమా విడుదలవుతున్న విషయం కూడా చాలా మందికి తెలీదు. ఈ చిత్రానికి ఇంకా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టకపోవడం గమనార్హం. రెండు, మూడు పాటలు వదిలినా కానీ దాని వల్ల వచ్చిన లాభం సున్నా. ఇక డిసెంబర్ 6న శ్రీనివాసరెడ్డి దర్శకత్వం చేసి నిర్మించిన భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు అనే సినిమాకు పబ్లిసిటీ సూన్యం. దాని వల్ల బజ్ కూడా సూన్యమే. ఈ వారాంతమే మరో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. వాటి పేర్లు కూడా చాలా మందికి తెలీవు.

- Advertisement -

వెంకీ మామ డిసెంబర్ 13న అంటున్నారు కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విడుదలకు ఇంకా నాలుగు వారాలు కూడా లేదు. ఇక రిలీజ్ డేట్ ప్రకటించి గట్టిగా ప్రమోషన్స్ చేస్తేనే ఆశించిన బజ్ వచ్చేది. ఈ చిత్రానికి ఓవర్ బడ్జెట్ పెట్టిన కారణంగా ఓపెనింగ్స్ దంచికొట్టాల్సిన అవసరముంది. ఇక డిసెంబర్ 20న ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు వస్తున్నాయి. ప్రతిరోజూ పండగే నుండి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. అయితే సినిమాపై పాజిటివ్ బజ్ ఇంకా ఏర్పడలేదు. నందమూరి బాలకృష్ణ రూలర్ అయితే ఎటువంటి ప్రమోషన్స్ చేపట్టలేదు. అసలే బాలయ్యకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది కాబట్టి త్వరగా పబ్లిసిటీ మొదలుపెడితే మంచిది. డిసెంబర్ 25న రాజ్ తరుణ్ నటించిన ఇద్దరి లోకం ఒకటే సినిమా విడుదల కానుంది. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి దాని గురించి పట్టించుకోవడమే మానేసినట్టున్నారు దిల్ రాజు అండ్ కో. మరి ఈ సినిమాలకు ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారో బజ్ రావడానికి ఏమేం చేస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All