Homeటాప్ స్టోరీస్రాజ్ తరుణ్ లవర్ సినిమా ప్లాపా ?

రాజ్ తరుణ్ లవర్ సినిమా ప్లాపా ?

no buzz for raj tarun's loverరాజ్ తరుణ్ హీరోగా నటించిన ” లవర్ ” చిత్రం ఈనెల 20 న విడుదల అవుతోంది దాంతో ఆ చిత్ర ప్రమోషన్ లో దిల్ రాజు మాట్లాడిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉంది . ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే లవర్ సినిమా ప్లాప్ అని ముందే డిసైడ్ అయి ఉంటారు అందుకే దిల్ రాజు ఇలా మాట్లాడుతున్నాడని అంటున్నారు . రాజ్ తరుణ్ కు మార్కెట్ లేదని అతడితో సినిమా అంటే నాలుగు కోట్లే ఎక్కువ అని , కానీ మేము డబుల్ పెట్టామని …… నాతో ఓ సినిమా చేయండి సార్ అని రాజ్ తరుణ్ అదేపనిగా అడుగుతుంటే కాదనలేక ఈ సినిమా చేశామని స్వయంగా దిల్ రాజు చెబుతున్నాడంటే దానర్థం లవర్ సినిమా ప్లాప్ జాబితాలో చేరినట్లేనా ? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు .

గతకొంతకాలంగా రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతున్నాయి . ఈ అయిదేళ్ల కాలంలో రాజ్ తరుణ్ 13 సినిమాల్లో నటించగా అందులో ప్లాప్ సినిమాలే ఎక్కువ . కిట్టు ఉన్నాడు జాగ్రత్త , అందగాడు , రంగుల రాట్నం ,రాజుగాడు ఇలా వరుసగా వచ్చిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి ఇక ఈ లవర్ సంగతి ఏంటి అన్నది రేపు ప్రేక్షకులు తీర్పు ఇవ్వనున్నారు అయితే వాళ్ళ కంటే ముందే దిల్ రాజు మాటలతో ప్లాప్ అన్న సంకేతాలు వెలువడుతున్నాయి .

- Advertisement -

English Title: no buzz for raj tarun’s lover

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All